BigTV English

World Cup 2027 : వన్డే వరల్డ్ కప్ 2027 వేదికలు ఖరారు…మొత్తం ఎన్ని మ్యాచ్ లు అంటే

World Cup 2027 :  వన్డే వరల్డ్ కప్ 2027 వేదికలు ఖరారు…మొత్తం ఎన్ని మ్యాచ్ లు అంటే

World Cup 2027 : ప్రస్తుతం మెన్స్ క్రికెట్ లో ఆసియా కప్ 2025 ట్రెండ్ కొనసాగుతోంది. వచ్చే నెల 09 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 28న ఫైనల్ తో ముగుస్తుంది. ఇది ముగిసిన తరువాత టీ-20 వరల్డ్ కప్ కొనసాగుతుంది. దీని తరువాత ఇక వన్డే మ్యాచ్ ల విషయానికి వస్తే.. 2027లో వన్డే వరల్డ్ కప్ కొనసాగనుంది. ఈ సారి 2027 వన్డే వరల్డ్ కప్ సౌతాఫ్రికాలో జరుగనున్నాయి. సౌతాఫ్రికాలోని మొత్తం 8 వేదికల్లో వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగనున్నాయి. వాటిలో 44 మ్యాచ్ లు సౌతాఫ్రికాలో జరిగితే.. 10 మ్యాచ్ లు మాత్రం జింబాబ్వే మరియు నమిబియాలో కలిసి జరుగుతాయి. ముఖ్యంగా సౌతాఫ్రికాలోని ఈ 8 వేదికల్లో కలిపి 44 మ్యాచ్ లు జరుగుతాయి.


Also Read : Watch Video : చేతులు లేకుండానే క్రికెట్ ఆడుతున్నాడు.. సిక్స్ లు, ఫోర్లు కూడా బాదేస్తున్నాడు… వీడు మగాడ్రా బుజ్జి

ఆ 8  వేదికలు ఖరారు


ఆ వేదికలను ఒకసారి పరిశీలించినట్టయితే.. జోహన్నెస్‌బర్గ్, ప్రిటోరియా, కేప్ టౌన్, డర్బన్, గ్వెబెర్హా, బ్లూమ్‌ఫాంటెయిన్, ఈస్ట్ లండన్, పార్ల్  ఈ 8 వేదికల్లో సౌతాఫ్రికాలో వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతాయని CSA ఓ ప్రకటనలో వెల్లడించింది.  మొత్తం జరిగే 54 మ్యాచ్ ల్లో 44 మ్యాచ్ లు దక్షిణాఫ్రికాలోని ఈ ఎనిమిది వేదికల్లో.. మిగిలిన 10 మ్యాచ్ లు జింబాబ్వే మరియు నమీబియాలో జరుగుతాయి. 2003 వెర్షన్ దక్షిణాఫ్రికా, జింబాబ్వె, కెన్యాలో జరిగిన తరువాత ఇది సౌతాఫ్రికాలో జరుగుతున్న తొలి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ అవుతుంది. అప్పటి నుంచి దక్షిణాఫ్రికా రెండు మహిళల ప్రపంచ కప్ లకు ఆతిథ్యం ఇచ్చింది. 2005లో 50 ఓవర్ల పోటీ.. అలాగే 2023 టీ-20 ప్రపంచ కప్ అయితే ఈ టీ-20 మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్ లో ఓడిపోయింది. మరోవైపు సౌతాఫ్రికా మాజీ ఆర్థిక మంత్రి ట్రెవర్ మాన్యేయేల్ స్థానిక ఆర్గనైజింగ్ కమిటీ కి నాయకత్వం వహిస్తారు. వైవిద్యభరితమైన, సమ్మిళితమైన, ఐక్యమైన సౌతాఫ్రికా ముఖ చిత్రాన్ని ప్రతిబింబించే ప్రపంచ వ్యాప్త, స్పూర్తిదాయకమైన కార్యక్రమాన్ని నిర్వహించడం CSA దార్శనికత అని CSA చైర్ పర్సన్ షెర్ల్ మాఫోషే అన్నారు.

సౌతాఫ్రికా, జింబాబ్వే సంయుక్త ఆతిథ్యం

2027లో సౌతాఫ్రికా, జింబాబ్వేలో జరిగే ప్రపంచ కప్ లో మొత్తం 14 జట్లు ఆడనున్నాయి. వీటిలో సౌతాఫ్రికా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. టోర్నమెంట్ ఆతిథ్య దేశం కావడంతో సౌతాఫ్రికా, జింబాబ్వే నేరుగా అర్హత సాధిస్తాయి. ఇది కాకుండా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచిన 8 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన నాలుగు స్థానాలను గ్లోబల్ క్వాలిఫయర్ టోర్నమెంట్ ద్వారా నిర్ణయిస్తారు. నమీబియా తొలిసారిగా టోర్నమెంట్ కి సహ-మోస్ట్ చేస్తుంది. అయితే వారి భాగస్వామ్యం పై పూర్తి హామీ లభించలేదు. నమీబియా పూర్తి ఐసీసీ సభ్యదేశం కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. నమీబియా టోర్నీలో తన స్థానాన్ని కాపాడుకోకపోవడానికి ప్రామాణిక అర్హత నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. 2003 నుంచి నమీబియా వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనలేదు.

Related News

Sarfraz Khan : గే తో టీమిండియా యంగ్ క్రికెటర్ అ**క్రమ సంబంధం?

Watch Video : చేతులు లేకుండానే క్రికెట్ ఆడుతున్నాడు.. సిక్స్ లు, ఫోర్లు కూడా బాదేస్తున్నాడు… వీడు మగాడ్రా బుజ్జి

Dream 11 Second Innings : డ్రీమ్ 11 ఇండియాలో బ్యాన్ అయిందా.. షాక్ లో ఐపీఎల్ అభిమానులు.. కేంద్రం క్లారిటీ ఇదే

Watch Video: పాపం ట్రాఫిక్ పోలీస్.. క్రికెట్ ఆడలేక.. బ్యాట్ అడుక్కుని మరీ… వీడియో వైరల్

Surya Kumar Yadav : సూర్య కుమార్ వాచ్ లో రాముడు, హనుమంతుడు… దీని ధర ఎంత అంటే

Big Stories

×