Hibiscus Leaves: ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు బయట దొరికే కొన్ని రకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే వీటిని వాడటం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే హోం రెమెడీస్ వాడటం మంచిది. వీటిలో మందార ఆకులు ప్రధానమైనవి. మందార ఆకులు జుట్టు పెరుగుదలకు, జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. ఈ ఆకులు జుట్టును ఒత్తుగా, నల్లగా, నిగనిగలాడేలా చేయడంలో అద్భుతంగా పని చేస్తాయి. జుట్టు పెరుగుదలకు మందార పూలను ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మందార ఆకుల వల్ల కలిగే లాభాలు:
జుట్టు పెరుగుదలకు: మందార ఆకులలో విటమిన్ సి, ఫాస్ఫరస్, కాల్షియం, రైబోఫ్లేవిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలపరిచి, జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా.. కొత్త జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడతాయి.
చుండ్రు నివారణకు: చుండ్రు సమస్యతో బాధపడే వారికి మందార ఆకులు మంచి పరిష్కారం. ఈ ఆకులలో యాంటీ-ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల చుండ్రుకు కారణమయ్యే సూక్ష్మజీవులను నిరోధించి, తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది.
కండీషనర్ గా: మందార ఆకులను పేస్ట్ లా చేసి తలకు పెట్టుకుంటే.. అది ఒక సహజ కండీషనర్ లా పనిచేస్తుంది. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
జుట్టు పగలకుండా: జుట్టు చివర్లు పగలడం అనేది ఒక సాధారణ సమస్య. మందార ఆకులు జుట్టు చివర్లను ఆరోగ్యంగా ఉంచి, పగలకుండా కాపాడతాయి.
మందార ఆకులను ఎలా ఉపయోగించాలి ?
1. మందార ఆకుల హెయిర్ మాస్క్ (నూనెతో):
కావాల్సినవి: ఒక గుప్పెడు మందార ఆకులు, కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్.
తయారీ విధానం: మందార ఆకులను శుభ్రంగా కడిగి, పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ను కొబ్బరి నూనెలో కలిపి తలకు బాగా పట్టించండి. ఒక గంట పాటు అలా ఉంచి, తరువాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
2. మందార ఆకుల షాంపూ:
కావాల్సినవి: మందార ఆకులు, మందార పువ్వులు, శీకాయ లేదా కుంకుడుకాయ.
తయారీ విధానం: మందార ఆకులను, పువ్వులను, శీకాయ లేదా కుంకుడుకాయలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం ఈ మిశ్రమాన్ని బాగా నలిపి, షాంపూలా ఉపయోగించి తల స్నానం చేయండి. ఇది జుట్టును సున్నితంగా శుభ్రం చేయడమే కాకుండా, జుట్టును బలపరుస్తుంది.
Also Read: జుట్టు తొందరగా పెరగాలంటే ?
3. మందార ఆకుల హెయిర్ మాస్క్ (మెంతులతో):
కావాల్సినవి: మందార ఆకులు, మెంతి గింజలు.
తయారీ విధానం: ఒక స్పూన్ మెంతి గింజలను రాత్రంతా నానబెట్టండి. ఉదయం మందార ఆకులతో కలిపి మెత్తగా పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ను తలకు ప్యాక్ లా వేసి 20-30 నిమిషాలు ఉంచండి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది.
మందార ఆకులను మీ జుట్టు సంరక్షణలో భాగంగా చేసుకుంటే.. నిగనిగలాడే, బలమైన, ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం అవుతుంది. ఈ చిట్కాలను ప్రయత్నించి, మీ జుట్టులో వచ్చిన మార్పులను గమనించండి. ఏవైనా సమస్యలు ఉంటే, ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. ఎల్లప్పుడూ సహజ పద్ధతులను ఎంచుకోవడం మీ జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది.