Sahasra Murder: రెండు తెలుగు రాష్ట్రాల్లో కూకట్ పల్లి సహస్ర హత్య కేసు సంచలనంగా మారింది. చోరికి వెళ్లి అడ్డు వచ్చిన బాలికను కత్తితో 21 పోట్లు పొడిచి దారుణంగా చంపిన విషయం తెలసిందే. అయితే ఈ హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బాలిక హత్య గురించి విచారణలో కీలక విషయాలు చెప్పినట్టు సీపీ మహంతి వెల్లడించారు.
క్రికెట్ బ్యాట్ కోసమే ఇదంతా..?
ఈ నెల 18న బాలిక హత్య జరిగిందని సీపీ మహంతి చెప్పారు. నెల క్రితమే నిందితుడు ఇదంతా ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు. ‘బ్యాట్ కోసమే బాలిక ఇంటికి వెళ్లినట్టు విచారణలో చెప్పాడు. బ్యాట్ తీసుకుని వెళ్తున్న నిందితుడిని బాలిక అడ్డుకుంది. ఈ క్రమంలోనే ఆమెను నెట్టి వేయడంతో గోడకు పడింది. బ్యాట్ తీసుకుని బాలికపై కత్తితో దాడి చేశాడు. నిందితుడికి సోషల్ మీడియాలో క్రైమ్ సీన్స్ చూసే అలవాటు ఉంది. మా స్టైల్ లో మేం విచారణ చేయడంతో నిందితుడు ఒప్పుకున్నాడు. తనిఖీల్లో నిందితుడి లేఖ, కత్తి దొరికంది’ అని పోలీసులు వెల్లడించారు.
బాలిక ఇంటికి రెండోసారి వెళ్లిన నిందితుడు
‘స్పెషల్ ఫోరెన్సిస్ టీం నిందితుడిని గుర్తించందని సీపీ మహంతి వెల్లడించారు. ఘటన వెనుక ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉన్నట్టే ఏం కనిపించండం లేదని చెప్పారు. నిందితుడు బాలిక ఇంటికి వెళ్లడం ఇది రెండోసారి. అమ్మాయి చూడని సమయంలో బ్యాట్ తీసుకుని వెళ్లాలని నిందితుడు అనుకున్నాడు. బ్యాట్ కొనలేని పేదరికంతో నిందితుడు దొంగతనానికి పాల్పడ్డాడు. విచారణలో నిందితుడు పోలీసులను తప్పు దారి పట్టించాడు’ సీపీ మహంతి పేర్కొన్నారు.
ALSO READ: Octopus video: అద్భుతమైన వీడియో.. తనను కాపాడినందుకు అక్టోపస్ ఎలా థ్యాంక్స్ చెప్పిందో చూడండి..!
నా బిడ్డను చంపేసిన వాడికి బతికే హక్కు లేదు..
సహస్య హత్యపై ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తన కూతరుని చంపిన నిందితుడిని వదలొద్దని బాలిక తండ్రి కృష్ణ ప్రభుత్వాన్ని, పోలీసులను వేడుకున్నాడు. పక్కా ప్లాన్ వేసుకుని దొంగతనానికి వచ్చాడు. అడ్డొచ్చిన నా కూతురిని చంపేశాడు. నా బిడ్డను చంపేసిన వాడికి బతికే హక్కు లేదు. హంతకుడు బాలుడు కాదు.. పెద్దవాడే.. సహస్రను చంపిన వాడికి ఉరిశిక్ష వేయాలి. అన్యాయంగా నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు’ తల్లడిల్లిపోయాడు.
ALSO READ: Anil Ambani: అంబానీకి ఊహించని షాక్.. తల్లి ఆస్పత్రిలో ఉండగానే ఇంట్లో సీబీఐ సోదాలు