Sailesh kolanu:అప్పుడప్పుడు సినీ సెలబ్రిటీలు వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసుకునే వీడియోలు ఆశ్చర్యంగానూ.. అద్భుతంగానూ ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అలా తాజాగా డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh kolanu) పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం ఆయన అభిమానులకి నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియోలో ఆయన కొడుకు ఏడుస్తూ అడిగిన ప్రశ్నకి శైలేష్ కొలను ఇచ్చిన జవాబుకి చాలామంది నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా రియాక్ట్ అవుతూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ డైరెక్టర్ శైలేష్ కొలను కొడుకు అంత క్యూట్ గా తండ్రిని ఏం అడిగారు..? తండ్రి ఇచ్చిన ఆన్సర్ ఏంటి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కొత్త బ్రాండ్ అడుగుతున్న శైలేష్ కొలను కొడుకు..
దర్శకుడు శైలేష్ కొలను తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన కొడుకు క్యూట్ గా ఏడుస్తూ మాట్లాడిన ఒక ఫన్నీ వీడియోని షేర్ చేసుకున్నారు.ఆ వీడియోలో శైలేష్ కొలను కొడుకు క్యూట్ గా ఏడుస్తూ ఉంటాడు. దానికి డైరెక్టర్ అరేయ్ ఏంట్రా నీ ప్రాబ్లం అని అడిగితే..”నాన్న నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు” అంటూ క్యూట్ గా మాట్లాడుతాడు.. ఈ బుడ్డోడి మాటలకు శైలేష్ కొలను..” రెస్పెక్ట్ కావాలా.. ? అరేయ్ వీడికేదో కొత్త బ్రాండ్ కావాలంట.. అడుగుతున్నాడు చూడండిరా.. వీడికి రెస్పెక్ట్ కావాలంట రెస్పెక్టూ” అంటూ ఫన్నీగా నవ్వుతూ షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వు పుట్టిస్తోంది. ఈ వీడియో కింద చాలామంది నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
శైలేష్ కొడుకుకి అండగా సూపర్ హీరో..
ఇక నెటిజన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. అలా హనుమాన్(Hanuman ) మూవీ ఫేమ్ తేజ సజ్జా (Teja sajja) కూడా రిప్లై ఇస్తూ.. “ఎందుకు నా ఫ్రెండ్ ని ఏడిపిస్తున్నావు? అంటూ శైలేష్ కొలను పేరుని ట్యాగ్ చేశారు.. ఇక తేజ సజ్జా పెట్టిన కామెంట్ కి శైలేష్ కొలను కూడా రిప్లై ఇస్తూ.. “హో ఇప్పుడు వీడికి సూపర్ హీరోస్ సపోర్ట్ కూడా ఉందా..? అయితే వీడికి రెస్పెక్ట్ ఇచ్చేయాల్సిందే ” అంటూ రిప్లై ఇచ్చాడు. అటు నెటిజన్స్ కూడా.. పాపం పిల్లోడు డైరెక్టర్ గారూ.. ఇచ్చేయకూడదూ.. రెస్పెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే శైలేష్ కొలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొడుకుకి సంబంధించి పోస్ట్ చేసిన వీడియోకి చాలామంది నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఎంతైనా చిన్న పిల్లలకి సంబంధించి ఇలాంటి క్యూట్ క్యూట్ ఇన్సిడెంట్స్ చూస్తే పేరెంట్స్ తో పాటు చూసే వాళ్లకు కూడా నవ్వు పుట్టిస్తాయి.
దర్శకుడు శైలేష్ కొలను సినిమాలు..
దర్శకుడు శైలేష్ కొలను సినిమాల విషయానికి వస్తే.. ఈయన హిట్ ది ఫస్ట్ కేస్, హిట్:2 ది సెకండ్ కేస్, హిట్ :3 వంటి మూడు సినిమాలతో సక్సెస్ఫుల్ దర్శకుడిగా టాలీవుడ్ లో స్టార్డమ్ సంపాదించారు. అయితే ఈయన చేసిన హిట్, హిట్ -2 వంటి సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ అవ్వడంతో… వెంకటేష్ తన 75వ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చారు. అలా వెంకటేష్ హీరోగా చేసిన సైంధవ్ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో చెప్పనక్కర్లేదు.
ALSO READ:The Bigg Folk Night 2025 : చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్న ది బిగ్ ఫోక్ నైట్
?utm_source=ig_web_copy_link