Watch Video : సాధారణంగా క్రికెట్ లో చిత్ర, విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. మనం నిత్యం ఏదో ఓ సందర్భంలో చూస్తూనే ఉంటాం. వాటిలో కొందరూ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేయడం.. మరికొందరూ బౌలర్లు చకా చకా వికెట్లు పడగొట్టడం ఇది కామనే. కానీ కొన్ని సందర్భాల్లో ఎన్నడూ వికెట్ తీయని బౌలర్ వికెట్లు తీసి రికార్డు కొట్టడం.. ఎన్నడూ పరుగులు చేయని బ్యాటర్ పరుగులు చేసి ఔరా అనిపించుకోవడం చూస్తుంటాం. మరోవైపు ఈ మధ్యకాలంలో బౌలర్లు రివర్స్ బంతి వేసి బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడం, లేదా బ్యాట్స్‌మెన్లు రివర్స్‌లో బ్యాటింగ్ చేసి సిక్సులు, ఫోర్లు కొట్టడం వంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ సిక్సులు, ఫోర్లు సాధారణంగా ఎవ్వరైనా కొడుతారు. కానీ ఇక్కడ చేతులు లేకుండానే క్రికెట్ ఆడుతున్నాడు ఓ యువకుడు.
Also Read : Dream 11 Second Innings : డ్రీమ్ 11 ఇండియాలో బ్యాన్ అయిందా.. షాక్ లో ఐపీఎల్ అభిమానులు.. కేంద్రం క్లారిటీ ఇదే
చేతులు లేకుండానే అద్భుతమైన బ్యాటింగ్
ఏకంగా సిక్స్ లు, ఫోర్లు బాదడంతో వీడు మగాడ్రా బుజ్జి అంటూ పొగుడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తనకు చేతి లేకుండానే భుజానికి తలకు మధ్యలో బ్యాట్ ఆనించి బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలర్ ఏ విదంగా బౌలింగ్ చేసినా బంతిని గాల్లోకి లేపుతున్నాడు. అచ్చం సిక్స్ లు, ఫోర్లతో చెలరేగిపోతున్నాడు. చూడటానికి చాలా చిన్నగా.. మరగుజ్జు వ్యక్తి మాదిరిగా ఉన్నప్పటికీ తన ఆటతో మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాడు. వీటికి తోడు కళ్లద్దాలు పెట్టుకొని అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు ఈ యువకుడు. ప్రస్తుతం ఇతని బ్యాటింగ్ కి సంబంధించి ట్రెండింగ్ కొనసాగుతోంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది. ఇండియాలో కూడా ఇప్పుడు క్రికెట్ అంటే చాలా మంది ఇస్టపడుతున్నారు.
ఇలాంటి వారిని వెలికి తీస్తే..
గతంలో క్రికెట్ ని ఇండియాలో చాలా తక్కువ మంది మాత్రమే ఆడేవారు. కానీ ప్రస్తుతం క్రికెట్ ఆడని ఊరే లేదు. ప్రతీ గ్రామంలో ఎక్కడో ఒక చోట క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. ముఖ్యంగా పంట పొలాల వద్ద, గల్లీలలో, చిన్న చిన్న మైదానాలలో, పాఠశాలలు, కళాశాలల్లో కూడా క్రికెట్ ఆడుతుంటారు. పండుగ సమయాల్లో చిన్న చిన్న గ్రామాలలో టోర్నమెంట్లను కూడా నిర్వహిస్తారు, ఆ ఆటలలో వివిధ రకాల బంతులను ఉపయోగిస్తారు. ముఖ్యంగా టాలెంట్ ఎవ్వరి సొత్తు కాదని నిరూపించాడు ఈ యువకుడు. అస్సలు ఎలాంటి పిచ్ అయినా అదిరిపోయే బ్యాటింగ్ తో ఇతని టాలెంట్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ను బీసీసీసీ కి ట్యాగ్ చేస్తూ జట్టులోకి తీసుకోవాలంటూ కొందరూ డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల్లో దాగి ఉన్న అద్భుతమైన ప్రతిభ కు ఇతడే నిదర్శనమని పేర్కొంటున్నారు. టాలెంట్ ఉండి టాలెంట్ ని వినియోగించుకొని ఆటగాళ్లు ఇలా చాలా మందే ఉన్నారని ఈ వీడియో ద్వారా స్పష్టంగా కనపిస్తోంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో చాలా మంది యువకులు వెలుగులోకి రాలేకపోతున్నారు.
?igsh=NWlkb2hvczd6Zjlt