Sahasra Murder Case: హైదరాబాద్, కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనలో పదో తరగతి చదువుతున్న మైనర్ బాలుడు నిందితుడిగా గుర్తించబడిన విషయం తెలిసిందే. సహస్ర కుటుంబం నివసిస్తున్న బిల్డింగ్ పక్కనే నిందితుడు కుటుంబం నివసిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి అక్కడ రెంట్ కు ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఆ బాలుడు దొంగతనం కోసం సహస్ర ఇంట్లోకి చొరబడినట్లు పోలీసులు తెలిపారు. సహస్ర తండ్రి కృష్ణ బైక్ మెకానిక్‌గా, తల్లి రేణుక ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ఘటన జరిగిన రోజు తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లడంతో సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉంది. నిందితుడు ఇదే అదునుగా చేసుకుని ఇంట్లోకి చొరబడి రూ. 80,000 దొంగిలించాడు. ఈ సమయంలో సహస్ర అతడిని చూసి ఇంట్లో వాళ్లకు చెబుతానని అనడంతో బాలుడు ఆమెను కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. ఆమె మెడ, ఛాతీ, పొట్టపై సుమారు 21 కత్తిపోట్లు పొడిచినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నమ్మలేని నిజాలు తెలుస్తున్నాయి.
నిందితుడు బాలికను అతి కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. హత్య చేయడానికి సైకో అవతారం ఎత్తాడని చెప్పారు. యూట్యూబ్ వీడియోలు చూడటం, క్రైమ్ సీన్స్ చూసి హత్య చేసినట్టు తెలుస్తోంది. పక్కా పథకం ప్రకారం క్రైమ్ సీన్ రచించిన బాలుడు కత్తి పట్టుకుని క్రూరత్వంగా ప్రవర్తించాడు. ఇంటర్నెట్‌లో ‘హౌ టు బ్రేక్ హుండీ, హౌ టు ఎస్కేప్’ వంటి సమాచారాన్ని సేకరించి.. ఓ కాగితంపై రాసుకున్నాడు. 14 ఏళ్ల వయస్సులోనే క్రైమ్ చెయ్యడం నేర్చుకున్నాడు. హత్య చేసి ఆ తర్వాత ఆధారాలు మాయం చెయ్యడం కూడా ఓటీటీ చూసి నేర్చుకున్నట్టు తెలుస్తోంది.
ALSO READ: IBPS Clerk Jobs: భారీ గుడ్ న్యూస్.. క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు.. ఇంకా 6 రోజుల సమయం
సహస్ర హత్య జరిగిన అనంతరం బాలుడిని పోలీసులు పలు మార్లు విచారించారు. పోలీసుల విచారణలో బాలుడు క్రిమినల్ ఇంటిలెజెంట్ గా వ్యవహరించాడు. పోలీసులను రూట్ మార్చి డైవర్షన్ చేసేలా ప్రయత్నించాడు. హత్య చేసిన బాలుడు క్రికెట్ ఆటగాడని పోలీసులు చెబుతున్నారు. క్రైమ్ సీన్ ను తలపించేలా బాలుడు హత్యకు ప్లాన్ చేశాడు. సహస్రను ఎందుకు హత్య చేశాడనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు కసితో హత్య చేసినట్టుగా కత్తిపోట్లు ఉన్నాయి. బాలిక సహస్ర చనిపోయిన తర్వాతే ఇంటి బయట డోర్ పెట్టి బాలుడు వెళ్లిపోయాడు.
ALSO READ: West Bengal News: భార్యను ముక్కులు ముక్కలుగా నరికి.. గుండెను వేరు చేసి.. చివరకు..?
బాలుడు రెగ్యులర్ గా కత్తి పట్టుకుని తిరుగుతాడని పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. తండ్రి మద్యానికి బానిస కాగా.. తల్లి ఓ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తుందని పోలీసులు తెలిపారు. బాలికను చంపి సైకో కిల్టర్ గా మారాడని పేర్కొన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే డైరీ లో బాలుడు నోట్ రాసుకున్నాడు. హత్య చేసిన బాలుడి తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ సంచలన ఘటనపై మరిన్ని నిజానిజాలు బయటపడనున్నాయి.