Sahasra Murder Case: సహస్ర మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. టెన్త్ క్లాస్ బాలుడు అత్యంత క్రూరంగా బాలిక సహస్రను చంపేశాడు. ఓ ప్రొఫెషనల్ కిల్లర్ లా బాలుడు ప్రవర్తించాడు. పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనానికి వెళ్లాడు. దొంగతనం ఎలా ప్రారంభించాలి..? ఎలా ముగించాలి..? క్లియర్ కట్ గా లెటర్ లో రాసుకున్నాడు. ఎవరైనా అడ్డు వస్తేఏం చేయాలన్నది కూడా ముందే ప్లాన్ చేసుకున్నాడు ఈ రాక్షసుడు. రూ.80వేలు దొంగలించాక సహస్ర ఎక్కడ పోలీసులకు, కుటుంబ సభ్యులకు చెబుతోందో అని పన్నెండళ్ల బాలికను దారుణంగా చంపాడు. పోలీసులు ఆ బాలుడు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
లెటర్ లో ఈ విధంగా రాశాడు..
గో టూ హోమ్..
రిమూవ్ ది లాక్
టేక్ ది మనీ
కీప్ ఇట్ గాడ్ దేర్
క్లోజ్ ది డోర్
కటింగ్ విత్ నైఫ్
బాలుడు దొంగతనం ఎలా చేయాలో వచ్చిరాని ఇంగ్లీష్‌లో రాసుకున్నాడు. హౌటు ఓపెన్ డోర్, హౌటు బ్రేక్ గాడ్ హుండీ, హౌటు ఎస్కేప్ హౌస్ అంటూ బాలుడు రాసుకున్నాడు. ఇదంతా గమనిస్తే.. బాలుడు ముందే దొంగతనం గురించి పకడ్బందీగా ఓ ప్లాన్ వేసుకున్నాడు. ఎప్పటి నుంచో ఆ ఇంట్లోకి దూరి చోరీకి పాల్పడాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముందుగా దొంగతనం కోసం ఎవరూ చూడకముందు సహస్ర ఇంట్లోకి దూరాడు. సహస్ర తల్లి దండ్రులు బయటకు వెళ్లిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చాడు.
బాలికను కిరాతకంగా చంపి..?
తలుపులు తెరిచి ముందుగా ఇంట్లోకి వెళ్లాడు. అనంతరం దేవుడి దగ్గర ఉన్న హుండీని పగులగొట్టేందుకు బాలుడు యత్నించి.. అందులో ఉన్న రూ.80వేలను దొంగలించాడు. ఆ తర్వాత బాలుడు బాత్రూం లోపలికి వెళ్లి.. బయటకు వచ్చే సమయంలో సహస్ర బాలుడిని చూశాడు. దొంగతనం విషయాన్ని తల్లిదండ్రులకు, పోలీసులకు చెబుతానని సహస్ర మందలించింది. దీంతో ఆ బాలిక పేరెంట్స్ కు చెబుతోందని భయానికి గురైన రాక్షస బాలుడు తనతో తెచ్చుకున్న కత్తితో సహస్ర పీక కోసం చంపాడు. చంపిన అనంతరం.. కింద పడిపోయిన సహస్రను 21 పోట్లు కిరాతకంగా పొడిచాడు.
గమనించిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్..
అనంతరం.. సహస్ర ఇంట్లో నుంచి బాలుడు పక్క బిల్డింగులోకి వెళ్లిపోయాడు. అక్కడ దాదాపు 15 నిమిషాల పాటు దాక్కున్నాడు. బాలుడు వ్యవహారాన్ని అంతా ఆ రోజు వర్క్ ఫ్రం హోమ్ జాబ్ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గమనించాడు. వెంటనే ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు బాలుడు చదువుతున్న స్కూల్ కి వెళ్లి విచారించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని అడగడంతో ఎంతకూ నోరు విప్పకపోవడంతో పోలీసులు ఇంటికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో లెటర్, కత్తి, రక్తంతో కూడిన దుస్తులు బయటపడ్డాయి. ప్రస్తుతం బాలుడిని పోలీసులు అరెస్ట్ చేసి లోతుగా విచారిస్తున్నారు.
ALSO READ: NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!