Dream 11 Second Innings : దేశంలోని ప్రముఖ పాంటసీ గేమింగ్ కంపెనీ డ్రీమ్ 11 కొత్త చట్టాలకు అనుగుణంగా తన రియల్ మనీ గేమింగ్ వ్యాపారాన్ని క్లోజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆన్ లైన్ గేమింగ్ బిల్లు ఆమోదంతో రియల్ మనీ గేమ్స్ పూర్తిగా నిషేదించబడ్డాయి. దీంతో ఫాంటసీ స్పోర్ట్స్, పోకర్, రమ్మీ, బెట్టింగ్ స్టైల్ యాప్ లు నిలిచిపోతాయనే ఆ:దోళనలు యూజర్లలోో పెరగడంతో వారు తమ డబ్బును వాలెట్ల నుంచి వెంటనే వెనక్కి తీసుకునేందుకు హడావిడి చెందుతున్నారు. ఈ వార్త ఇప్పుడు బీసీసీఐని ఇబ్బందుల్లోకి నెట్టింది. బీసీసీఐ ప్రధాన స్పాన్సర్ డ్రీమ్ 11 నిషేధం విధించే అవకాశం ఉండటంతో ఇప్పుడు ఇండియన్ క్రికెట్ కు ఊహించని సమస్య ఎదురైంది. లోక్ సభ, రాజ్యసభ రెండూ ఆన్ లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025ను ఆమోదించాయి.
Also Read : Watch Video: పాపం ట్రాఫిక్ పోలీస్.. క్రికెట్ ఆడలేక.. బ్యాట్ అడుక్కుని మరీ… వీడియో వైరల్
రాష్ట్రపతి సంతకం తరువాత చట్టంగా..
రాష్ట్రపతి సంతకం చేసిన తరువాత అది చట్టంగా మారుతుంది. ఈ బిల్లులో ఆన్ లైన్ మనీ గేమ్ లను నిర్వహించడం పై నిషేదం విధించింది. అంతేకాదు.. వాటి ప్రకటనలను కూడా నిషేదిస్తుంది. ఈ కారణంగా భారత జట్టు ఇక నుంచి ఆడబోయే మ్యాచ్ లకు జెర్సీ, కిట్ పై డ్రీమ్ 11 లోగోను ఉపయోగించడానికి అనుమతించబడదు. ఒక రకంగా చెప్పాలంటే డ్రీమ్ 11 ఇండియాలో బ్యాన్ అయిందనే చెప్పవచ్చు. డ్రీమ్ 11 ప్రస్తుతం ఇండియా మెన్స్, ఉమెన్స్ జట్లకు స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. 2023లో బీసీసీఐతో రూ.358 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకవేళ బిల్లు చట్టంగా మారితే టీమిండియా జట్టు ఎలాంటి స్పాన్సర్ షిప్ లేకుండానే ఆసియా కప్ లో ఆడనుంది. మరోవైపు భారత మహిళల జట్టు సెప్టెంబర్ 14 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ కి స్పాన్సర్ లేకుండా ఆడవచ్చు.
డ్రీమ్ స్పోర్ట్స్ డ్రీమ్ మనీ యాప్ ఆవిష్కరణ
మరోవైపు డ్రీమ్ 11 స్పందిస్తూ.. భారత్ లో నూతనంగా రూపొందించిన ఆన్ లైన్ గేమింగ్ చట్టాన్ని అనుసరించి మోడల్ ను ప్లే చేయడానికి అన్ని చెల్లింపులు, పోటీలకు పూర్తిగా ఉపయోగించబడింది. మేము ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవించే సంస్థగా ఉంటాం. చట్టాలకు అనుగుణంగా వ్యాపారాన్ని నిర్వహిస్తామని ట్విట్టర్ వేదికగా పోస్ట్ లో తెలిపారు. ఆన్ లైన్ గేమింగ్ చట్టం 2025 యొక్క ప్రమోషన్ రెగ్యులేషన్‌కు పూర్తిగా కట్టుబడి ఉంటామని తెలిపింది. మరోవైపు ఆన్ గేమింగ్ ప్రమోషన్, నియంత్రణ బిల్లు 2025 ను పార్లమెంట్ రెండు సభలు ఆమోదించాయి. ప్రధాని నరేంద్ర మోడీ దీని ఒక మైలు రాయి నిర్ణయంగా అభివర్ణించారు. ఇది సమాజాన్ని ఆన్ లైన్ మనీ గేమింగ్ ప్రతికూల ప్రభావాల నుంచి కాపాడుతుంది. అదే సమయంలో ఇ స్పోర్ట్స్, సోషల్ గేమింగ్ ను ప్రోత్సహించి భారతదేశాన్ని గేమింగ్, ఆవిష్కరణ, సృజనాత్మకతలకు కేంద్రంగా మారుస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే డ్రీమ్ స్పోర్ట్స్ డ్రీమ్ మనీ యాప్ ఆవిష్కరణ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు బంగారం, FDai, SIPలు వంటి పెట్టుబడులు ఎప్పుడూ భారతీయ వినియోగదారులను ఆకర్షించేవిగా ఉన్నాయి. కనీసం రూ.10తో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని కల్పించడం ద్వారా ఈ యాప్ మరింత విస్తృతమైన వినియోగదారుల వర్గాన్ని చేరుకోవచ్చని డ్రీమ్ 11 భావిస్తోంది.