Sahasra Murder Case: రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సహస్ర హత్య కేసు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. బ్యాట్ కోసమని బాలిక ఇంట్లోకి నిందితుడు కత్తితో కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అయితే.. కన్న కూతురు చనిపోవడంతో సహస్ర తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది.తమ కూతురుని చంపింది పక్కింటి ఓ మైనర్ బాలుడే అని తెలియడంతో.. ఆ తల్లిదండ్రులు ఆవేశానికి హద్దులు లేకుండా పోయాయి. తన కూతురుని చంపిన హంతకుడిని ఖచ్చితంగా చంపి తీరాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
నిందితుడిని మాకు అప్పజెప్పండి..
న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహస్రను చంపిన బాలుడిని తమకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. తన కూతురిని హత్య చేసినట్టే అతడిని శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అన్యాయంగా తన బాలికను చంపేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తు్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ALSO READ: Sahasra Murder: సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు.. క్రికెట్ బ్యాట్ కోసమే ఇదంతా..?
మేమే చంపామని నిందలు వేశారు..!
మేమే చంపామని చాలా నిందలు చేశారు. నా మీద, నా భర్త మీద ఆరోపణలు చేశారని బాలిక తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. తన కూతురి చావుకి కారణమైన ఆ హంతకుడిని వదిలిపెట్టకూడదనన్నారు సహస్ర తండ్రి. పెట్రోల్ పోసి హతమార్చాలన్నారు. ఆ హంతకుడు మైనర్ కాదని… క్రిమినల్ మైండ్ ఉన్న కిల్లర్ అని మండిపడ్డారు సహస్ర తండ్రి. అలాంటి క్రూరుడికి.. మరణ శిక్షే సరైనదన్నారు. ఎలాగైనా చట్టం ఆ హంతకుడికి మరణశిక్ష విధించాలని సహస్ర కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే తమకు కూతురిని చంపినందుకు.. తగిన న్యాయం తమకు జరుగుతుందంటున్నారు.
ALSO READ: Indian Railway: ఇండియన్ రైల్వేలో 2865 పోస్టులు.. టెన్త్, ఇంటర్, ఐటీఐ పాసైతే చాలు.. ఇదే మంచి అవకాశం
న్యాయ నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
అయితే బాలుడు మాత్రం మైనర్ కావడంతో.. మరణశిక్ష పడే అవకాశం ఉండదంటున్నారు న్యాయ నిపుణులు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉంది కాబట్టి.. జువెనైల్ జస్టిస్ బోర్డ్ ముందు హాజరు పరుస్తారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం.. మైనర్‌లను సాధారణ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో పెద్దలతో సమానంగా శిక్షించరు కానీ.. కొన్ని మూడేళ్ల పాటు సంస్కరణ కేంద్రంలో ఉంచే అవకాశం ఉంది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రధాన లక్ష్యం.. శిక్ష కంటే సంస్కరణ , పునరావాసంపై దృష్టి సారించడమే ఉంటుందని…న్యాయ నిపుణులు చెబుతున్నారు.