Vishal Mega Mart: విశాల్ మెగా మార్ట్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దేశంలో ప్రముఖ రిటైల్ చైన్ లలో ఒకటిగా కొనసాగుతోంది. నగరాలు, పట్టణాలతో కలిపి 700లకు పైగా స్టోర్లను కలిగి ఉంది. ఈ స్టోర్లలో గ్రాసరీ, బట్టలు, హౌస్ హోల్డ్ ఐటమ్స్ వంటి ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. డిమార్ట్, జియో మార్ట్ మాదిరిగానే ఇక్కడ కూడా తక్కువ ధరలకే వస్తువులు దొరుకుతాయి. పలు ఐటెమ్స్ మీద తగ్గింపు, బై వన్ గెట్ వన్ ఆఫర్లు, ఎంపిక చేసిన వస్తువులపై తగ్గింపు లాంటివి అందిస్తుంది. వినియోగదారులకు డబ్బును ఆదా చేయడంలో సాయపడుతుంది.
తరచుగా డిమార్ట్ లలో దొంగతనాలు
ఇప్పటి వరకు డిమార్ట్, జియో మార్ట్ లాంటి రిటైల్ స్టోర్లలో దొంగతనాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు విశాల్ మెగా మార్ట్ లో జరిగే దొంగతనాల గురించి చర్చించుకుందాం. ఈ స్టోర్లకు నిత్యం వేలాది మంది కస్టమర్లు వస్తుంటారు. వారిలో కొంత మంది చేతివాటం ప్రదర్శిస్తుంటారు. చాక్లెట్లు, కూల్ డ్రింక్స్, దుస్తులను ఎక్కువగా కొట్టేస్తుంటారు. ముఖ్యంగా కుర్రాళ్లు ఇలాంటి దొంగతనాలు పాల్పడుతున్నారు. కస్టమర్ల మాదిరిగా స్టోర్లలోకి వచ్చి చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ అక్కడే తినడం, తాగడం చేస్తుంటారు. మరికొంత మంది చాక్లెట్లను తీసుకెళ్లి ట్రయల్ రూమ్స్ లోనూ తింటున్నట్లు పలు స్టోర్ల సిబ్బంది వెల్లడిస్తున్నారు.
లోదుస్తుల దొంగతనాలు కూడా..
విశాల్ మెగా మార్ట్ లో ముఖ్యంగా దుస్తుల దొంగతనాలు జరుగుతాయి. యువకులు బనియన్లు, అండర్ వేర్లు ట్రయలర్ రూమ్స్ లోకి తీసుకెళ్లి వాటిని ధరించి బయటకు తీసుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. కొంత మంది ఏకంగా టీ షర్ట్ లు, ప్యాంట్లు కూడా తొడుక్కుని బయటకు వెళ్లిపోయిన సందర్భాలున్నాయి. కొంత మంది బిల్లింగ్ లేకుండా గ్రాసరీలను తీసుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. 2012లో అహ్మదాబాద్ లో ఇద్దరు మహిళలు కస్టమర్లుగా స్టోర్ లోకి అడుగు పెట్టి, రూ. 3,807 విలువైన షాంపూ బాటిల్స్ దొంగిలించడానికి ప్రయత్నించారు. ఎగ్జిట్ గేట్ దగ్గర వారు పట్టుబడ్డారు. ఆ తర్వాత స్టోర్ సిబ్బంది వారిని పోలీసులకు అప్పగించారు. 2019లో పట్నాలో ఒకవ మహిళ స్టోర్ లోని వస్తువులు దొంగిలించి బయటకు పరిగెత్తింది. కానీ, సెక్యూరిటీ సిబ్బంది ఆమెను పట్టుకున్నారు. 2024 వారణాసీలో ఒక మహిళ దుస్తులను తన లోదుస్తుల్లో పెట్టుకుని దొంగతనం చేయాలని భావించి దొరికిపోయింది. కొంత మంది ముస్లీం మహిళలు కూడా దొంగతనానికి ప్రత్నించి దొరికిపోయారు. గత 10 సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా పలు స్టోర్లలో దొంగతనాలు జరిగాయి.
Read Also: డిమార్ట్ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్ గా కొనేయొచ్చు?
సెక్యూరిటీ లోపాలు, CCTVల పర్యవేక్షణ సరిగా లేకపోవడం లేకపోవడం, సీగ్మెంట్ చెకింగ్ కారణంగా ఈ దొంగతనాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే విశాల్ మార్ట్ యాజమాన్యం సీసీకెమెరాల నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది.
Read Also: డి-మార్ట్ లో అత్యంత చౌకగా లభించే వస్తువులేంటీ? ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తారు?