Live-In Relation Agreement| మారుతున్న కాలంతో పాటు వివాహ బంధానికి ప్రత్యామ్నాయంగా సహజీవనం సంస్కృతి పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో పట్టణాల్లో ఈ లివ్ ఇన్ రిలేషన్ లో జీవిస్తున్న యువతియువకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. పెళ్లి అనే అధికారిక బంధం దాని బాధ్యతలు నుంచి తప్పించుకోవడానికే యువత ఈ సహ జీవన పద్ధతి వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ బంధానికి భారతదేశంలో చట్టపరంగా గుర్తింపు కూడా ఉంది. కానీ లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న చాలామంది జంటలు గొడవలు పడడం. ఒకరిపై మరొకరు కేసులు పెట్టడం జరుగుతోంది. తాజాగా ఇలాంటిదే ఒక ఘటన ముంబై లో జరిగింది.
ముంబై లో నివసించే ఒక 46 ఏళ్ల వ్యక్తి పై అతనితో సహజీవనం చేసిన 29 ఏళ్ల యువతి రేప్ కేసు పెట్టింది. అయితే కోర్టులో ఆ వ్యక్తి ఒక ఒప్పందం కాగితాలు చూపించి సులువుగా బెయిల్ పొందాడు. ఆ అగ్రిమెంటు గురించే ఇప్పుడు సోషల్ మీడియా చర్చ జరుగుతోంది. ఆ ఒప్పందం లోని అన్ని షరతులు చదివితే.. ఆ వ్యక్తి ఎంత తెలివైనవాడు, ముందుచూపుతో వ్యవహరించాడో అర్థమవుతోంది.
అత్యాచారం కేసులో నిందుతుడైన మహేశ్ (పేరు మార్చబడినది) ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తన్నాడు. మరోవైపు కేసు వేసిన యువతి (రీనా, పేరు మార్చబడినది) వృద్ధలకు నర్సుగా పనిచేస్తోంది. ఇద్దరూ కలిసి లివ్ ఇన్ రిలేషన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ బంధాన్ని వారు చట్టపరంగా అన్ని నిబంధనలతో పాటించాలనుకున్నారు. ముఖ్యంగా మహేశ్ ముందుచూపుతో వారి సహజీవనం గురించి జూలై 2024లో ఒక అగ్రీమెంటు తయారుచేసుకున్నారు.
ఆ అగ్రీమెంటు ప్రకారం.. ఏడు షరతులున్నాయి.
మొదటి కండీషన్ : వారిద్దరూ ఒక 11 నెలల కాలం పాటు అంటే ఆగస్టు 1, 2024 నుంచి జూన్ 30 వరకు లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటారు.
రెండో కండీషన్ : ఈ 11 నెలల కాలంలో ఒకరిపై మరొకరు ఏవిధమైన లైంగిక వేధింపుల కేసు వేయకూడదు. సహజీవనాన్ని శాంతియుతంగా గడపాలి.
మూడో కండీషన్ : మహేళ్ ఇంట్లోనే రీనా ఈ 11 కాలంపాటు నివసిస్తుంది. ఒకవేళ ఇద్దరి మధ్య గొడవలు జరిగితే.. ఒక నెల ముందు నోటీస్ ఇచ్చి విడిపోవచ్చు.
నాలుగో కండీషన్ : రీనా బంధువలెవరూ ఈ 11 కాలంపాటు మహేశ్ ఇంటికి రాకూడదు.
అయిదో కండీషన్ : రీనా ఎటువంటి మానసిక ఒత్తిడి గానీ వేధింపులు గానీ మహేళ్ పై చేయకూడదు.
ఆరో కండీషన్ : రీనా గర్భవతి అయితే మహేశ్ బాధ్యత వహించడు. రీనా స్వతహాగా పుట్టే పిల్లల బాధ్యత వహించాలి.
ఏడో కండీషన్ : ఒక వేళ మహేశ్ పై ఒత్తిడి చేసినా లేక మానసికంగా హింసించినా రీనా పై చర్యలు తీసుకోవచ్చు.
Also Read: ప్రేమికులపై యాసిడ్ దాడి చేసిన మహిళలు.. ఇద్దరూ వివాహితులే..!
ఈ అగ్రిమెంటు చదివితేనే అర్థమవుతోంది. మహేశ్ ఎంత ముందుచూపుతో ఆలోచించి సహజీవనం చేస్తున్నాడో. అయితే మహేశ్, రీనా నెల రోజులు కూడా కలిసి ఒక ఇంట్లో సహజీవనం చేయలేకపోయారు. వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఆగస్టు 25న మహేశ్ పై రీనా అత్యాచారం కేసు వేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పలుమార్లు తనను రేస్ చేశాడని కోర్టులో చెప్పింది.
అయితే కోర్టులో మహేశ్ లాయర్ ఈ లివ్ ఇన్ రిలేషన్ అగ్రిమెంటు చూపించి.. తన క్లైంటుపై మోసపూరితంగా ఈ కేసు వేశారని. ఇద్దరూ పరస్పర అంగీకారంతో నెల రోజులుగా సహజీవనం చేస్తున్నారని కోర్టుకు తెలిపాడు. రీనా ఒక ఫ్రాడ్ అని మహేళ్ లాయర్ వాదించాడు. కోర్టులో వారిద్దరి మధ్య కుదిరిన అగ్రిమెంటుని చూపించాడు.
ఆ అగ్రీమెంటు చూసిన కోర్టు మహేళ్ కి బెయిల్ మంజూరు చేసింది.
Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..
కానీ ఆ అగ్రీమెంటులో తను సైన్ చేయలేదని అదంతా అబద్ధమని రీనా కోర్టుకు తెలిపింది. అంతా మోసమని వాదించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణని కోర్టు వాయిదా వేసింది.