BigTV English

Actor Raghubabu Car Accident: నటుడు రఘుబాబు కారు యాక్సిడెంట్.. బీఆర్ఎస్ నేత మృతి!

Actor Raghubabu Car Accident: నటుడు రఘుబాబు కారు యాక్సిడెంట్.. బీఆర్ఎస్ నేత మృతి!

Actor Raghubabu Car Accident: టాలీవుడ్ సీనియర్ నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్న కారు.. ఓ బైక్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి స్పాట్‌లో మృతి చెందాడు. ఈ ఘటన నల్గొండ పట్టణంలో జరిగింది. మృతుడు నల్గొండ టౌన్‌కి చెందిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జనార్థన్‌రావుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.


నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన సందినేని జనార్థన్‌రావు బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. పట్టణ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద దత్తసాయ వెంచర్ ఏర్పాటు చేశాడు.

Tollywood actor Raghubabu car accident at nalgonda
Tollywood actor Raghubabu car accident at nalgonda

Also Read: OG Update: పవర్ స్టార్ ‘ఓజి’పై థమన్ అప్డేట్.. ఇది బిగినింగ్ మాత్రమే..


బుధవారం మధ్యాహ్నం వెంచర్ వద్దకు వెళ్లి బైక్‌పై వస్తుండగా.. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో జనార్థన్‌రావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వైఫ్ నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే రఘుబాబుని అదుపులోకి తీసుకున్న పోలీసులు, పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు పోలీసులు.

జనార్థన్‌రావు సొంతూరు నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామానికి చెందినవాడు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఘటన తర్వాత స్థానికులు నటుడు రఘుబాబుతో మాట్లాడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

Tags

Related News

Visakha RK Beach: బీచ్‌లో విషాదం.. గల్లంతైన ముగ్గురు వ్యక్తులు, ఒక్కరు మృతి

Telangana crime: పదేళ్ల పోరాటం ఫలితం.. ఆ కీచకుడికి ఉరి శిక్ష.. సంచలన తీర్పునిచ్చిన పోక్సో కోర్టు!

UP News: రాఖీ కట్టించుకుని మరీ బాలికపై అఘాయిత్యం.. ఆ తర్వాత ఫ్యాన్‌కు వేలాడ దీసి..?

Bengaluru Crime: వారిద్దరూ 30 ఏళ్లుగా ప్రాణ స్నేహితులు.. పదేళ్లుగా ఫ్రెండ్ భార్యతో ఎఫైర్, చివరికి ప్రాణం తీశారు!

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Big Stories

×