BigTV English

Bengaluru Crime: వారిద్దరూ 30 ఏళ్లుగా ప్రాణ స్నేహితులు.. పదేళ్లుగా ఫ్రెండ్ భార్యతో ఎఫైర్, చివరికి ప్రాణం తీశారు!

Bengaluru Crime: వారిద్దరూ 30 ఏళ్లుగా ప్రాణ స్నేహితులు.. పదేళ్లుగా ఫ్రెండ్ భార్యతో ఎఫైర్, చివరికి ప్రాణం తీశారు!

Bengaluru Crime: స్నేహం అనేది జీవితంలో అత్యంత విలువైన బంధం. అది కేవలం కలిసే స్నేహితుల మధ్య ఉన్న అనుబంధం మాత్రమే కాదు, ఒకరిపై మరొకరిని నమ్మకం, సహాయం, మరియు ప్రేమను చూపించే బలమైన బంధం. నిజమైన స్నేహం సవాళ్లలో, కష్టాల్లో, ఆనందంలోనూ ఒకరిని నిలబెడుతుంది. 30 ఏళ్ల స్నేహం అయినా, నమ్మకం, విశ్వాసం లేకపోతే, అది తక్కువ సమయంలోనే ముక్కలయ్యే అవకాశం ఉంది. దానికి ఉదాహరణ మిచోహళి గ్రామం ఘటన. స్నేహితుడి భార్యతోనే వివాహేత సంబంధం పెట్టుకున్న మరో దుర్మార్గపు స్నేహితుడి విచిత్ర ఘటన. అంతేకాదు ఆమెను దక్కించుకునేందుకు స్నేహితున్నే అతి కిరాతకంగా చంపేసిన ఘటన కూడా. అందుకే అంటారేమో దోస్త్ దోస్త్ నా రహా అని. అయితే మెఛోహళి లో ఏం జరిగింది. ఎలా స్నేహితున్ని చంపేశారు అనేది తెలుసుకుందాం.


39 సంవత్సరాల వయస్సున్న విజయ్ కుమార్… మూడు దశాబ్దాలపాటు బెంగుళూరులోని మిచోహళి గ్రామంలో నివాసముంటున్నాడు.  అతను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పనిచేసేవాడు. అతనికి Asha అనే భార్య ఉన్నారు. వీరు 10 ఏళ్ళ క్రితం వివాహమయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరిద్దరు కామాక్షిపల్యాలో నివాసం ఉంటున్నారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో విజయ్ తో 30 ఏళ్లుగా స్నేహంగా వున్న ధనంజయ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఒకవైపు స్నేహమూ, మరోవైపు కుటుంబ జీవితమూ ఒక్కసారిగా కూలిపోయింది. ఎందుకంటే… విజయ్ కుమార్ తన భార్య ఆశా మరియు తన చిన్ననాటి మిత్రుడు ధనంజయ (Jay) మధ్య వివాహేతర సంబంధం. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధ ఉందని తెలుసుకున్న విజయ్ కుంగిపోయాడు.

వారిద్దరి ఫొటోలు బయటకు రావడంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని కన్నీరు పెట్టుకున్నాడు. ధనంజయ నుంచి ఆశాను దూరంగా తీసుకుని వెళ్లాలని ప్లాన్ వేశాడు. అక్కడి నుంచి తన భార్య ఆశాను తీసుకుని మిచోహళిలో అద్దె ఇంటికి వెళ్ళారు. కానీ, ఆశా, ధనంజయ వివాహేతర సంబంధం కొనసాగుతూ వచ్చింది. ఇంతలో చిన్న ట్విస్ట్ సోమవారం రాత్రి విజయ్ కుమార్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. ఆ సమయంలో అతనిపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పోలీసులు సమాచారం అందడంతో మిచోహళి గ్రామంలోని D గ్రూప్ హౌసింగ్ ప్రాంతంలో విజయ్ కుమార్ శవాన్ని కనుగొన్నారు


పోలీసుల నిర్ధారణ ప్రకారం: ఈ హత్యలో ధనంజయ్, ఆశా ప్రధాన నిందితులుగా నిర్ధారించారు. విజయ్ కుమార్ భార్య, మిత్రుడు మధ్య వివాహేతర సంబంధం బయటకు రావడంతో, వారు ఈ ఘోర చర్యకు పాల్పడ్డారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే FIR నమోదు చేసుకుని, దర్యాప్తు మొదలైంది. ఆశాని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే, ధనంజయ్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. ఆశాతో పాటు, ఇతర అనుమానితులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

Related News

UP News: రాఖీ కట్టించుకుని మరీ బాలికపై అఘాయిత్యం.. ఆ తర్వాత ఫ్యాన్‌కు వేలాడ దీసి..?

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Big Stories

×