BigTV English

UP News: రాఖీ కట్టించుకుని మరీ బాలికపై అఘాయిత్యం.. ఆ తర్వాత ఫ్యాన్‌కు వేలాడ దీసి..?

UP News: రాఖీ కట్టించుకుని మరీ బాలికపై అఘాయిత్యం.. ఆ తర్వాత ఫ్యాన్‌కు వేలాడ దీసి..?

UP News: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఔరైయా ప్రాంతంలో రాఖీ పండుగ జరిగినే రోజు దారుణ హత్య జరిగింది. 33 ఏళ్ల సూర్జీత్ అనే వ్యక్తి తన 14 ఏళ్ల బంధువైన బాలికపై అత్యాచారం చేశాడు. ఆపై ఆమెను దారుణంగా హత్య చేశాడు. చివరకు దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు డెడ్ బాడీని ఫ్యాన్ కు ఉరి వేసి వేలాడదీశాడు. ఈ ఘటన పోలీసులను, స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


రాఖీ పండుగ రోజు, శనివారం ఉదయం సూర్జీత్ తన మామ ఇంటికి వెళ్లారు. తన బంధువైన ఆ బాలిక చేత రాఖీ కట్టించుకున్నాడు. అనంతరం సూర్జీత్ బయటకు వెళ్లి పీకల దాకా మద్యం సేవించి మళ్లీ ఇంటికి వెళ్లాడు. అప్పటికే నిద్రలో ఉన్న 14 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడు. అనంతరం బాలిక ఎక్కడ కుటుంబ సభ్యులకు చెబుతుందోనని ఆమెను హత్య కిరాతకంగా చేశాడు. తర్వాత, ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె డెడ్ బాడీని ఫ్యాన్ కు ఉరి వేసి వేలాడదీశాడు. ఆ బాలిక తండ్రి అదే ఇంటిలో వేరే గదిలో నిద్రిస్తున్నాడు. మరో రూంలో జరుగుతోన్న ఈ ఘటన గురించి ఆయనకు తెలియదు. మరుసటి రోజు ఉదయం బాలిక డెడ్ బాడీని చూసిన తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

ALSO READ: Dog video: పిల్లలపై వీధి కుక్క దాడి.. హీరోలో వచ్చి కాపాడిన పెంపుడు కుక్క.. వీడియో వైరల్


పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం విచారణ చేపట్టగా.. వెంటనే ఇది ఆత్మహత్య కాదని గుర్తించారు. ఇంటిలోని వివిధ ప్రదేశాల్లో రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు కచ్చితంగా ఇది హత్యేనని పేర్కొన్నారు. విచారణ సమయంలో సూర్జీత్ కుటుంబ సభ్యులతోనే ఉన్నాడు. వారిని మాట్లాడనీయకుండా.. వారి తరపున సమాధానాలు ఇస్తూ పోలీసులకు అనుమానం కలిగించాడు. ఔరైయా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిజీత్ శంకర్ వివరణ ప్రకారం.. పోస్టుమార్టంలో బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. సూర్జీత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతను నేరాన్ని అంగీకరించాడని ఆయన తెలిపారు.

ALSO READ: Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనుకూలించని వాతావరణం.. ఐదు విమానాలు మళ్లింపు

ఈ దారుణ ఘటన స్థానిక సమాజంలో తీవ్ర ఆగ్రహాన్నిచ, భయాన్ని కలిగించింది. రాఖీ వంటి పవిత్రమైన పండుగ రోజున, బంధుత్వాన్ని అవమానకరంగా మార్చిన ఈ దారుణం బాలికల భద్రతపై మరోసారి ప్రశ్నలకు దారి తీసింది. పోలీసులు ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోనున్నారు. న్యాయం కోసం కుటుంబం ఎదురుచూస్తోంది. ఇలాంటి నీచులకు పోలీసులకు  కఠిన శిక్ష వేయాలని నెటిజన్లు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related News

Bengaluru Crime: వారిద్దరూ 30 ఏళ్లుగా ప్రాణ స్నేహితులు.. పదేళ్లుగా ఫ్రెండ్ భార్యతో ఎఫైర్, చివరికి ప్రాణం తీశారు!

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Big Stories

×