Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దౌసా-మనోహర్‌పూర్ రోడ్డులో వ్యాన్-కంటైనర్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 10 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు కుటుంబాలకు చెందినవారు ఖాతు శ్యామ్ ఆలయంలో దర్శనం తర్వాత తిరిగి వ్యాన్‌లో స్వస్థలాలకు బయలుదేరారు.
దౌసా-మనోహర్‌పూర్ హైవేకి సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను వ్యాన్ ఢీ కొట్టింది. స్పాట్‌లో 10 మంది మృతి చెందారు. వారిలో ముగ్గురు మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. చనిపోయినవారు యూపీకి చెందినవారు తెలుస్తోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడికి చేరుకున్నారు.
ప్రమాదం సమయంలో వ్యాన్‌లో దాదాపు 30 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడినవారిలో తొమ్మిది మందిని చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. మరికొందరు స్థానిక జిల్లా ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.
ALSO READ: ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ ఫూల్‌కి వెళ్లిన బాలికలపై అత్యాచారం
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్, పోలీసు సూపరింటెండెంట్ సాగర్ రాణాలు ఆసుపత్రికి చేరుకున్నారు. గాయపడిన వారి పరిస్థితి గురించి ఆరా తీశారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు సాధ్యమైనంత సహాయం చేస్తామని తెలిపారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అధిక వేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.