4 Yogas: నాలుగు యోగాలు ఉన్న అమ్మాయిలకే ధనవంతులైన భర్తలు లభిస్తారట. అవును మీరు చదువుతున్నది నిజమే.. ఎవరి జాతకంలో అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నాలుగు అద్బుతమైన యోగాలు ఉంటాయో అటువంటి అమ్మాయిలు ఎక్కడున్నా వారికి కోట్లు సంపాదించే వ్యక్తులు భర్తలుగా లభిస్తారట. ఒకవేళ పెళ్లికి మందు ధనవంతుడు భర్తగా రాకపోతే పెళ్లి అయిన తర్వాత ఆ అమ్మాయి భర్త కోట్లకు అధిపతి అవుతాడట. ఇంతకీ ఆ నాలుగు యోగాలేంటి..? ఎలాంటి అమ్మాయిలకు ఆ యోగాలు ఉంటాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయితే నాలుగు రాజయోగాలు ఉంటాయో అలాంటి అమ్మాయిలకు ఉత్తమమైన కరోడ్‌పతి అయిన భర్తలు లభిరస్తారట. ఒకవేళ పెళ్లికి ముందు భర్తలు పెద్దగా సంపాదించకపోయినా ఈ యోగాలు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకున్న తర్వాత కోట్లకు అధిపతులు అవుతారట. ఆ యోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజ్య పూజిత రాజయోగం: ఈ యోగం ఉన్న అమ్మాయిలు ఎంతో ప్రత్యేకమైన వారట. వీరి వ్యక్తిగత జాతకంలో 7వ ఇంటికి అధిపతి శుభగ్రహాలైన గురువు, శుక్రుడు, బుధుడు, లేదా చంద్రుడు అయినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఇది ఉన్న మహిళలకు ధనవంతుడు, ఉన్నత పదవిలో ఉన్న భర్త లభిస్తాడు. వీరి వివాహ జీవితం రాజసంగా, సుఖసంపదలతో సాగిపోతుందట.
చంద్ర మంగళ యోగం: అమ్మాయిల వ్యక్తిగత జాతకంలో 7వ ఇంటిలో చంద్రుడు మరియు కుజుడు కలిసి ఉన్నప్పుడు ఈ శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది. చంద్రుడు కర్కాటక, మేష లేదా మకర రాశిలో ఉండటం వలన దీని ఫలితాలు ఇంకా పెరుగుతాయట. ఈ యోగం ఉన్న అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకు విపరీతమైన ధనయోగం పడుతుందట. ఈమె భర్త ఏ పని చేసినా పట్టిందల్లా బంగారంలా ఉంటుందట. పెళ్లి తర్వాత ఈ యోగం ఉన్న అమ్మాయిల జీవితం అద్బుతంగా సాగుతుందట. వీరికి మంచి కేరీర్ లభిస్తుందట.
మాలవ్య యోగం: ఈ యోగం శుక్రిడి అధారంగా ఏర్పడుతుంది. శుక్రుడు 7వ ఇంటిలో తులా, వృషభ లేదా మీన రాశిలో ఉన్నప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఉన్నవారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. భర్త అధిక సంపద కలిగిన వారిగా ఉండడం వల్ల వివాహానంతరం వీరికి రాజ భోగాలు లభిస్తాయట.
శశ రాజయోగం: శని గ్రహం 7వ ఇంటిలో ఉన్నప్పుడు శశ రాజయోగం ఏర్పడుతుందట. ఈ యోగం ఉన్న అమ్మాయిలకు సకల గుణాభిరాముడు లాంటి భర్త లభిస్తాడట. ఈ అమ్మాయిల భర్తలు ఎక్కువగా ప్రభుత్వ లేదా ప్రభుత్వ సంబంధిత పదవుల్లో హైలెవల్ గా ఉంటారట. ఈ యోగం ఉన్న అమ్మాయిలకు ఎప్పుడూ డబ్బుకు ధనానిక లోటు ఉండదట.
ఈ నాలుగు శుభయోగాలు జాతకంలో ఉన్నట్లయితే ఆ మహిళల జీవితంలో రాజసుఖాలు, సంపదలు, ఉన్నత స్థితి లభిస్తాయట. భర్తల విజయవంతమైన స్థితి వారి జీవితాలను గౌరవంగా.. సుఖంగా మార్చుతుందట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: న్యూమరాలజీ ప్రకారం ఆ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఉత్తమ భార్యలు అవుతారట