Visakha RK Beach: విశాఖ ఆర్కే బీచ్ దారుణ విషాదం చోటుచేసుకుంది. సముద్రం వద్దకు స్నానానికి వెళ్లి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ముగ్గురిలో ఒకరు ఒడ్డుకు చేరుకుని ప్రాణాలతో బయటపడ్డారు. మరొక మహిళ మృతిచెందారు. ఇంకొకరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ కు చెందిన వారని పోలీసులు తెలిపారు. బంగాళ ఖాతంలో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
ఒడ్డున ఉన్న ముగ్గురిని కెరటాలు లోపలకి లాక్కెళ్లాయని సురక్షితంగా బయటకు వచ్చిన వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం మృతిచెందిన మహిళ డెడ్ బాడీని పోస్టుమార్టంకు తరలించారు. సముద్రంలో గల్లంతయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వివాహ వేడుకు కోసం హైదరాబాద్ నుంచి కుటుంబం విశాఖకు వచ్చిందని పోలీస్ అధికారులు తెలిపారు.. బీచ్‌లో సరదాగా స్నానానికి దిగిన సమయంలో ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: BSF Jobs: బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
ALSO READ: Jammu Kashmir cloudburst: జమ్మూ కశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్.. 38 మంది మృతి.. 200 మంది గల్లంతు!