BigTV English

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీసే టార్గెట్… బుర్ర బద్దలయ్యే ట్విస్టులున్న మిస్టీరియస్ బాక్స్… క్లైమాక్స్ హైలెట్

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీసే టార్గెట్… బుర్ర బద్దలయ్యే ట్విస్టులున్న మిస్టీరియస్ బాక్స్… క్లైమాక్స్ హైలెట్

OTT Movie : హారర్ జానర్ కి ఎక్కువ అభిమానులు ఉంటారు. ఈ సినిమాలు ఇచ్చే స్పైన్ చిల్లింగ్ థ్రిల్ మరో లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక దెయ్యం ప్రెగ్నెంట్ మహిళలని టార్గెట్ చేస్తుంటుంది. ఈ సినిమా ఒక కాలేజ్ ప్రొఫెసర్, అతని ప్రెగ్నెంట్ భార్య చుట్టూ తిరుగుతుంది. ఈ జంట అనుకోకుండా ఒక శాపగ్రస్త మాయన్ బాక్స్ ద్వారా దుష్ట శక్తిని విడుదల చేస్తారు. ఈ దెయ్యం వారి జీవితాలను, ముఖ్యంగా లిసా గర్భాన్ని లక్ష్యంగా చేసుకుని భయంకరమైన సంఘటనలను సృష్టిస్తుంది. ఈ హారర్ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘మాలిషియస్’ (Malicious) మైఖేల్ విన్నిక్ దర్శకత్వం వహించిన అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమా ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా 90 నిమిషాల రన్‌టైమ్‌తో, IMDbలో 5.1/10 రేటింగ్‌ ను పొందింది. ఇది ఇంపాసిబుల్ డ్రీమ్ ఎంటర్‌టైన్‌మెంట్, లాస్ట్ హిల్స్ ఫిల్మ్ ఫండ్ ద్వారా నిర్మించబడింది.


స్టోరీలోకి వెళ్తే

ఈ కథ ఆడమ్ అనే కాలేజ్ ప్రొఫెసర్, అతని ప్రెగ్నెంట్ భార్య లిసా చుట్టూ తిరుగుతుంది. ఆడమ్‌కు ఒక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ఉద్యోగం రావడంతో ఒక గ్రామీణ ఇంటికి మారతారు. వీళ్ళు ఆనందకరమైన కొత్త జీవితం గడపాలనుకుంటారు. ఇంతలో లిసా సోదరి బెక్కీ తెచ్చిన ఒక పురాతన మాయన్ బాక్స్ (Mayan box) ఈ జంటకి బహుమతిగా ఇస్తుంది. ఆతరువాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఈ బాక్స్‌ను లిసా తెరవడంతో, ఒక దుష్ట ఆత్మ బయటికి వస్తుంది. ఇది లిసా గర్భం, వారి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది.లిసా విచిత్రమైన దృశ్యాలు, అతీంద్రియ సంఘటనల బారిన పడుతుంది. ఇవన్నీ ఆమె గర్భస్రావానికి దారితీస్తాయి.

ఆడమ్, ఒక లాజికల్ వ్యక్తిగా, మొదట ఈ అతీంద్రియ సంఘటనలను నమ్మడు. కానీ డాక్టర్ క్లార్క్ అనే అతని సహోద్యోగి, ఒక గుడ్డి పారాసైకాలజిస్ట్ తో ఈ బాక్స్ ఒక శక్తివంతమైన దెయ్యాన్ని కలిగి ఉందని గుర్తిస్తాడు. ఈ దెయ్యం గతంలో ఇంట్లో నివసించిన వారిని కూడా బాధించిందని, ఒక భర్త తన భార్యను చంపిన దారుణ సంఘటనకు కారణమైందని తెలుస్తుంది. ఈ దెయ్యాన్ని ఆపడానికి దానిని విడుదల చేసిన వ్యక్తి చనిపోవాలని జేమ్స్ అనే వ్యక్తి చెప్తాడు. అంటే ఇప్పుడు లిసా చనిపోయేంతవరకూ ఆ దెయ్యం వెంటాడుతూనే ఉంటుంది.

Read Also : ప్రాణంగా ప్రేమించిన వాడే కసాయిగా మారితే… హీరోనే విలన్… జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన మూవీ

ఇక క్లైమాక్స్ లో దెయ్యం లిసాను పూర్తిగా ఆవహిస్తుంది. ఆమె ఆడమ్‌పై దాడి చేస్తుంది. ఆత్మరక్షణలో ఆడమ్ లిసాను చంపేస్తాడు. దీనితో దెయ్యం తాత్కాలికంగా అదృశ్యమవుతుంది. ఆడమ్ లిసా హత్య కేసులో జైలుకు వెళతాడు. చివరి సన్నివేశంలో, లిసా సోదరి బెక్కీ ఇప్పుడు గర్భవతిగా ఉంటుంది. అదే శాపగ్రస్త బాక్స్‌ను బహుమతిగా తీసుకుంటుంది. ఆడమ్ ఉద్దేశపూర్వకంగా దానిని ఆమెకు పంపాడని తెలుస్తుంది. ఇక ఈ దుష్ట చక్రం కొనసాగుతుందని ఒక సూచనతో సినిమా ఎండ్ అవుతుంది. .

Related News

OTT Movie : ప్రైవేట్ ఐలాండ్ లో అరాచకం… అమ్మాయిలకే తెలియకుండా ఆ పని… మైండ్ బెండయ్యే ట్విస్టులు

OTT Movie : ఐదుగురు మనుషులతో 30 రోజులు అదే పని… బ్లడీ డెత్ గేమ్… థ్రిల్లింగ్ మలుపులు, ఊహించని సర్ప్రైజులు

OTT Movie : ఫామ్ హౌజ్ లో పార్టీ… అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రారు… కల్లోనూ వెంటాడే హర్రర్ సీన్స్

Coolie OTT: రజినీకాంత్ కూలీ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే!

OTT Movie : ఇదెక్కడి సినిమారా బాబూ… మొక్కలకు ప్రాణం వచ్చి మనుషుల్ని లేపేస్తే… సై -ఫై మాస్టర్ పీస్ థ్రిల్లర్

Big Stories

×