
Bharani Nakshatram : భైరవుడిని పూజిస్తే గ్రహ దోషాలూ, అపమృత్యు గండాలూ తొలగిపోతాయనీ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ మంత్రశాస్త్రం చెబుతోంది కాశీ మహానగరం, ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవడి ఆలయాలున్నాయి. అష్టమి తిథి నాడు భైరవుడిని పూజించడం ద్వారా అష్టలక్ష్మి అనుగ్రహం, భైరవ అనుగ్రహం కలగడం జరుగుతుంది. భరణి నక్షత్రం రోజున భైరవుడికి ప్రత్యేకమైన పూజలు చేయడం విశేష ఫలితాలను ఇస్తాయి. భైరవుడు భరణి నక్షత్రంలో అవతరించాడు. కాబట్టి భరణి నక్షత్రంవారు భైరవుడిని పూజిస్తే విశిష్ట ఫలితాలను పొందవచ్చు.
అమావాస్య రోజున భైరవుని పూ సకల దిష్టి దోషాలను దూరం చేస్తుంది. కాలభైరవుడికి అమావాస్య అష్టమి తిథుల్లో ఎరుపు రంగు పువ్వులను సమర్పించవచ్చు. అలాగే మిరియాల దీపం వెలిగించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి. అమావాస్య రోజున అన్నదానం చేయడం ద్వారా కాలభైరవుడు సంతృప్తి చెందుతాడు.
అష్టమి రోజున అన్నంలో తేనె కలిపి వడ్డిస్తే మంచిది. తద్వారా వ్యాపారంలో లాభం చేకూరుతుంది. కాలభైరవుని ఆలయంలో రాహుకాలంలో రుద్రాభిషేకం విభూతి అభిషేకం నిర్వహిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. భైరవ సహస్రనామ కార్యక్రమం నిర్వహిస్తే వివాహ యోగాన్ని పొందుతారు. కాలభైరవునికి ప్రతి శనివారం బిల్వంతో సహస్రనామ అర్చన చేస్తే శుభకార్యాలు జరుగుతాయి