IND VS AUS, 4th T20: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 4th T20I) మధ్య ఇవాళ నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య మూడు టి20 లు పూర్తయ్యాయి. ఇవాళ క్వీన్స్‌ల్యాండ్ లోని కరారా ఓవల్ వేదికగా ( Carrara Oval, Queensland) నాల్గో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు సిరీస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో రెండు జట్లకు కూడా కసిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే 1-1 తేడాతో సిరీస్ సమం చేసుకున్నాయి రెండు జట్లు.
Also Read: RCB: బెంగళూరుకు కొత్త కోచ్..WPL 2026 టోర్నమెంట్, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్ మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభం కానుంది. 1:15 గంటల సమయంలో ఈ రెండు జట్ల మధ్య టాస్ ప్రక్రియ ఉంటుంది. ఇవాళ్టి మ్యాచ్ కు కూడా వర్షం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్వీన్స్ ల్యాండ్ లో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇవాల్టి మ్యాచ్ కు కూడా అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇలాంటి నేపథ్యంలో టాస్ ముందుగా గెలిచిన జట్టు , బౌలింగ్ చేస్తేనే మంచిదని అంటున్నారు. ముందుగా బౌలింగ్ చేస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. వర్షం పడినా కూడా స్కోర్ చూసుకొని ఆడేయవచ్చు.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఇవాల్టి నాలుగో టెస్ట్ నేపథ్యంలో వైస్ కెప్టెన్ గిల్ పై వేటు వేసేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు చెబుతున్నారు. వరుసగా మూడు టి20 మ్యాచ్ లలో దారుణంగా విఫలమయ్యాడు గిల్. సారా టెండుల్కర్ స్టేడియానికి వచ్చిన కూడా పెద్దగా రాణించలేదు. దీంతో అతనికి రెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. అతని ప్లేస్ లో రింకూ సింగ్ ను బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక రెండు జట్ల మధ్య 35 మ్యాచ్ లు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో టీమిండియా 21 మ్యాచ్ లలో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆసీస్ 12 మ్యాచ్ లలో విజయం సాధించింది.
టీమిండియా ప్లేయింగ్ XI: శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, జేవియర్ బార్ట్‌లెట్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్.
AUS vs IND Series Launch! 💪pic.twitter.com/EIeRPMGRgW
— CricketGully (@thecricketgully) October 17, 2025