OTT Movie : యుక్త వయస్సులో అందరికీ ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. తమ సందేహాలను అధిగమిస్తూ, గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అంతే కాకుండా శరీరంలో వచ్చే మార్పులను కూడా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక హాలీవుడ్ సినిమా, టీనేజ్ దశలో ఉండే అమ్మాయిల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘Are You There God? It’s Me, Margaret’ అనేది 2023లో వచ్చిన అమెరికన్ మూవీ. ఇది జూడీ బ్లూమ్‌ల 1970లో వచ్చిన ఒక ప్రసిద్ధ నవల ఆధారంగా, కెల్లీ ఫ్రెమన్ క్రెయిగ్ దర్శకత్వంలో రూపొందింది. 106 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా, ఐయండిబిలో 7.3/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2023 ఏప్రిల్ 28న థియేటర్స్ లో విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
మార్గరెట్ కుటుంబం న్యూయార్క్ సిటీ నుండి న్యూజెర్సీలోని ఒక శివారు ప్రాంతానికి మారుతుంది. ఇది మార్గరెట్‌కు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె తన స్నేహితులను, మరీ ముఖ్యంగా తన అమ్మమ్మను విడిచి వెళ్లాల్సి వస్తుంది. ఇక కొత్త ప్రదేశంలో మార్గరెట్‌కు నాన్సీ వీలర్ అనే పొరుగు అమ్మాయి స్నేహితురాలు అవుతుంది. నాన్సీ, గ్రెట్చెన్, జానీ కలిసి ఒక “సీక్రెట్ క్లబ్” ఏర్పాటు చేసుకుంటారు. ఈ క్లబ్‌లో అమ్మాయిలు యుక్తవయస్సు సమస్యల గురించి – ముఖ్యంగా వారి శరీరంలో వచ్చే మార్పులు, అబ్బాయిలు, ముద్దులు వంటి విషయాల గురించి మాట్లాడుకుంటారు. వీళ్ళ జోరు మాత్రం మామూలుగా ఉండదు.
Read Also : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్
మార్గరెట్ తండ్రి యూదు మతానికి చెందినవారు, తల్లి క్రైస్తవ మతానికి చెందినది. వారిద్దరూ వేర్వేరు మతాల నేపథ్యం నుండి వచ్చారు కాబట్టి, మార్గరెట్‌కు ఏ మతాన్ని పాటించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. దీంతో మార్గరెట్ మత విశ్వాసాల గురించి తీవ్రంగా ఆలోచిస్తుంది. ఆమె దేవునితో తన మనసులో మాట్లాడుకుంటూ ఉంటుంది. తన ఆందోళనలు, సందేహాలు, కోరికలు అన్నీ దేవుడితో పంచుకుంటుంది. ఇంతలో ఆమె ఒక వ్యక్తిని ఇష్ట పడుతుంది. అతనికి ముద్దు కూడా పెట్టాలను కుంటుంది. చివరికి మార్గరెట్ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది ? ఆమె ఏ మతాన్ని ఎంచుకుంటుంది ? బాయ్ ఫ్రెండ్ కి ముద్దు పెడుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.