Rain Alert: తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ వాగులు, వంకలు వరదలై పారుతున్నాయి. ప్రజలు బయటికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. నిన్న తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. తెలంగాణలో ఈ సంవత్సరం సాధారణం కంటే 40 శాతం అధిక వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడం.. అల్పపీడనాలు, మొంథా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వర్షాలు జిల్లాలను వదలకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయితే..
తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలంగాణలో వర్షాకాలం ముగిసిన తర్వాత కూడా వర్షాలు ఆపడం లేదు.. రోజు రోజు వర్షాలు ఎక్కువవుతున్నాయి.. కానీ, తగ్గడం లేదు.. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. నల్గొండ, సూర్యాపేట, గద్వాల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, నారాయణపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Also Read: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?
ఏపీలో ఆవర్తనం ఎఫెక్ట్.. ఇవాళ భారీ వర్షాలు..
ఏపీలో ప్రస్తుతం తమిళనాడు మీదు కొనసాగుతున్న ద్రోణి కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న నంద్యాల కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని 9 జిల్లాలకు అలర్ట్ చేశారు. పిడుగులతో కూడని వర్షాలు పడతాయని చెబుతున్నారు. కడప, నెల్లూరు, రాయలసీమ, అనంతపురం, కృష్ణా, శ్రీసత్యసాయి, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల కింద నిల్చోవద్దని సూచించారు.