Vote Chori: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వివాదం కొనసాగుతుండగా బ్రెజిలియన్ మోడల్ లారిస్సా రియాక్ట్ అయ్యారు. తన పాత ఫోటో వైరల్ కావడంతో నోరు విప్పారు. అసలేం జరిగింది?
బ్రెజిల్ మోడల్ లారిస్సా
తనపై ఫోటో మీద వస్తున్న వార్తలపై బ్రెజిలియన్ మోడల్ లారిస్సా స్పందించింది. భారతదేశంలో ఎన్నికల ప్రయోజనాల కోసం తన పాత ఫోటో దుర్వినియోగం కావడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. పోర్చుగీస్ భాషలో మాట్లాడుతూ.. అబ్బాయిలారా.. తానొక జోక్ చెబుతానని, చాలా దారుణంగా ఉంటుందని తెలిపింది.
తన పాత ఫోటోను భారతదేశంలో ఓటు వేయడానికి ఉపయోగిస్తున్నారని తెలుసుకున్నాను. పార్టీల మధ్య పోరాటంలో తనను భారతీయురాలిగా చిత్రీకరిస్తున్నారు. ఇదొక పొలిటికల్ డ్రామాగా వర్ణించారు. ఇది పిచ్చిగా ఉందని చమత్కరించింది. ఈ విషయం తెలియగానే ఓ మీడియా ప్రతినిధి ఇన్‌స్టాగ్రామ్ సంప్రదించినట్టు వివరించింది.
ఓటు చోరీ వ్యవహారం
తొలుత ఈ విషయమై తాను నమ్మలేదని, నమ్మశక్యం కానిది మరియు వింతైనదని పేర్కొంది. మోడల్ లారిస్సా షేర్ చేసిన వీడియోపై ఫేమస్ నటుడు ప్రకాష్‌రాజ్ స్పందించారు. గోబి ఉంటే ఇలాంటివి సాధ్యమవుతుందా? అంటూ సెటైరికల్‌గా రాసుకొచ్చారు. జస్ట్ ఆస్కింగ్, బ్రెజిలియన్ జనతాపార్టీ, ఓటు చోరీ అని హ్యాస్ ట్యాగ్‌కి లింక్ చేశారు.
2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఓ బ్రెజిలియన్ మోడల్‌కు చెందిన ఫోటోతో 22 నకిలీ ఓట్లు సృష్టించారని విమర్శించారు.
ALSO READ: బీహార్‌లో తొలివిడత పోలింగ్.. 121 సీట్లకు పోలింగ్
ఓటర్ల జాబితాలో మోడల్‌ని స్వీటీ, సీమ, సరస్వతి ఇలా రకరకాల పేర్లతో కనిపించినట్టు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం ఎందుకు కనిపెట్టలేకపోయిందని ప్రశ్నించిన విషయం తెల్సిందే. ఈ వ్యవహారం నేపథ్యంలో లారిస్సా నోరు విప్పారు.
వీటిని కాంగ్రెస్ పార్టీ అప్పుడే ప్రశ్నించాల్సి ఉందని, ఆ పని ఎందుకు చేయలేదని కమలనాథులు ప్రశ్నించారు. అవన్నీ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని కేంద్రమంత్రి రిజిజు అన్నారు. ఈ వ్యవహారంపై అటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా రియాక్ట్ అయ్యింది. ఓటర్ల జాబితాపై అప్పుడు ఎలాంటి అభ్యంతరాలు రాలేదన్నారు.
Is She saying “ Gobi hai tho Pumpkin hai ”??? #BrazilianJantaParty #VoteChori #justasking https://t.co/NgwmKeIJZB
— Prakash Raj (@prakashraaj) November 5, 2025