Gundeninda GudiGantalu Today episode November 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. ప్రభావతి మనోజ్ ఒకేసారి కలిసి రావడం చూసి అందరూ షాక్ అవుతారు. మీరిద్దరేంటి ఒకేసారి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అని రోహిణి అందరూ ఒకేసారి అడుగుతారు.. అదేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు ఏదో దొంగల్ని అడిగినట్లు అని ప్రభావతి అంటుంది. దానికి బాలు మీరు దొంగలే కదా అని అంటారు.. రోహిణి ఎక్కడి నుంచి వచ్చారు మనోజ్ అని అడుగుతుంది. నేను డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్లి మాట్లాడేసి వస్తున్నాను.. అమ్మ బయట కనిపించింది. అలా లోపలికి ఇద్దరు ఒకేసారి వచ్చాం అని మనోజ్ అంటాడు. ప్రభావతి నుంచి నగలను తీసుకొని వెళ్లిన మీనా బాలు ఆ నగలు గిల్టువి అని తెలుసుకొని షాక్ అవుతారు. ఈ విషయం గురించి తేల్చుకోవాలని బాలు అంటే మీనా మాత్రం అమ్మమ్మగారి పుట్టినరోజు అయిపోయేంతవరకు మీరు ఏమి అడగద్దు అని మాట తీసుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… బాలు ఆవేశంగా ఇంటికి రావడంతో మీనా ఏవండీ మీరు ఇంత ఆవేశంగా ఇంటికి వెళ్తున్నారంటే ఏదో ఒక గొడవ చేస్తారు అమ్మమ్మ గారి పుట్టినరోజు అయ్యేంతవరకు మీరు ఎటువంటి గొడవ చేయదు అని మాట తీసుకుంటుంది. ఆ తప్పు చేసింది ఎవరు? మనము రెండు రోజుల తర్వాత తెలుసుకుందాం మీరు మాత్రం ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకోండి అని మీనా సలహా ఇస్తుంది.. దానికి బాలు అదేంటో తేలుస్తాను వారి అంత చూస్తాను అని అంటాడు.. ఒకసారి మావయ్య గారిని చూడండి వాళ్ళ అమ్మ పుట్టినరోజు కోసం అని ఎంత సంతోషంగా ఉన్నారో… సంతోషాన్ని మీరు దూరం చేస్తారా అని నేను అడుగుతుంది..
ఇక సత్యం దగ్గరికి వెళ్లిన బాలు ఈ పనులన్నీ మీరు చేస్తున్నారేంటి నాన్న మేము ఉన్నాం కదా చూసుకుంటాం కదా అని అడుగుతాడు.. నా పిల్లలకి కట్టాను రా.. ఈరోజు నా తల్లికి కడుతున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అని సత్యం అంటాడు.. బాలు లోపలికి వెళ్ళగానే కడుపు మండిపోతుంది రగిలిపోతుంది అన్నట్లు అంటాడు. ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావు అని ? అందరూ అడుగుతారు.. కానీ బాలు మాత్రం ఏమి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు.. బెలూన్స్ ఉదాలి అని రవి అనగానే మనోజ్ నాకు రాదు రా అని అంటాడు.. ఏది రాదురా ఇంకేం వస్తుంది ఎత్తుకుపోవడం ఒకటే వస్తుందా అని బాలు అంటాడు..
ఆ తర్వాత ప్రభావతి మీద సెటైర్లు వేస్తాడు.. మాయలు మంత్రాలు చేయడం ఈ మంత్రావతికి మాత్రమే తెలుసు అని ఇండైరెక్టుగా ప్రభావతిని తిడతాడు. పొద్దు పొద్దున్నే ఏంట్రా నా మీద పడ్డావు అని ప్రభావతి అంటుంది.. కడుపు మంట అని మీనా అంటుంది.. నువ్వేంటే ఇంట్లో వంట పని వదిలేసి బయటికి వెళ్లి షికారులు చేసేస్తున్నావా అని ప్రభావతి తిడుతుంది. వంట నేనే చేస్తాను మంట నేనే పెడతాను ఏ మీకు చిన్నప్పటినుంచి వంట వండడం రాదా ఏంటి…? నేను పుట్టడంతోనే ఇంట్లో వంట పుట్టిందా..? అయిందా అని మీనా అనడంతో బాలు బాగా చెప్పావు మీనా అని అంటాడు..
ప్రభావతి మాత్రం ఏం మాట్లాడుతుంది ఇది అని అంటుంది. వదిన నేను మీకు సహాయం చేయనా వంటలు అని రవి అంటాడు.. అయితే ఏమొద్దు రవి నేను చూసుకుంటాను వంట చేయగలను వంట నేనే పెట్టుకోగలను అని ఇండైరెక్టుగా మీనా మాట్లాడుతుంది.. ఇక మనోజు రోహిణి దగ్గరికి వెళ్ళగానే మనము అమ్మమ్మ గారికి ఏదైనా గిఫ్ట్ కొనాలని రోహిణి అంటుంది. రోహిణి రింగ్ బెటర్ అని అంటుంది.. అంతేం అవసరం లేదు ఒక చీర కొనిపిస్తే సరిపోతుంది నేను వెళ్లి స్నానం చేసి వస్తాను ఇద్దరం వెళ్లి చీర కొనుక్కొని వద్దామని అంటాడు..
వెళ్ళగానే రోహిణికి వాళ్ల అమ్మ ఫోన్ చేస్తుంది.. ఏంటమ్మా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తావని రోహిణి అనగానే అప్పుడే చింటూ అమ్మ నేను అని మాట్లాడుతాడు.. మనోజ్ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు.. మా క్లైంట్ తో మాట్లాడుతున్నాను లేండి ఆవిడ పేరు బుజ్జి అని అనగానే మనోజ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు.. ఇక సుశీలను దగ్గరుండి బాలు తీసుకొని వస్తాడు.. ఏంట్రా మొహం అలా మార్చుకుని ఉన్నావు అంటే కొన్ని నిజాలు తెలిసి అలా ఉన్నానులే అని అంటాడు ఏమైందిరా అని సుశీల అడుగుతుంది..
Also Read :పల్లవిని అవమానించిన ఫ్రెండ్.. చక్రధర్ పై పల్లవి సీరియస్.. మీనాక్షికి షాక్..
రాత్రి ట్రిప్ కి వెళ్ళాను లే నానమ్మ అందుకే అలా ఉన్నాను అనిపిస్తుంది నీకు అని అంటాడు బాలు.. సత్యం ప్రభావతి ఇద్దరూ సుశీల కోసం బయట ఎదురు చూస్తూ ఉంటారు.. ఇంటిదాకా వచ్చింది ఇంట్లోకి రాకుండా పోతుందా ఏంటి అని ప్రభావతి అంటుంది.. అందరూ కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి సంతోషంగా ఉంటారు.. మీనా హారతి తీసుకొని వస్తుంటే.. ఏంటి నువ్వు మంచి దానివి అని మార్కులు కొట్టేయాలని చూస్తున్నావా ఆ హారతి రోహిణి శృతి ఇస్తారు అని అంటుంది.. హారతి వాళ్ళకి ఇచ్చి తీయమని చెప్తుంది.. మీనా అక్కడే ఉంది కదా ముగ్గురు కలిసి తీస్తారని సుశీల అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.