Intinti Ramayanam Today Episode November 6th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని తన ఇంట్లోని వాళ్లకు ఎంతో సంతోషంగా తన తల్లిని పరిచయం చేస్తుంది. ఆ వచ్చిన ఆవిడ అవని వాళ్ళ తల్లి అని తెలుసుకుని అందరూ సంతోషపడతారు. మీరు నా ప్రాణాలు కాపాడడానికి వచ్చారని నాకు సంతోషంగా ఉంది అత్తయ్య గారు అని అక్షయ్ కూడా అంటాడు.. కమల్ కూడా మీరు మా అన్నయ్య ప్రాణాలు కాపాడారు అంటే మాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు అని అంటాడు.. అవని తన ఇంట్లోని వాళ్లందరినీ పరిచయం చేస్తుంది.. లోపలికి వెళ్ళగానే ఈమె ఎవరో తెలుసా ఆరాధ్యను అక్షయ్ అడుగుతాడు… మీ అమ్మ వాళ్ళ అమ్మ అంటే నీకు అమ్మమ్మ అవుతుంది అని ఆరాధ్య తో అంటాడు. భరత్ ఎక్కడ అని అడగని భరత్ కి ఫోన్ చేసి అసలు విషయాన్ని అవని చెప్తుంది.. భరత్ అమ్మ మన ఇంటికి వచ్చింది నువ్వు ప్రణతిని తీసుకొని ఇక్కడికి రా అని అవని అంటుంది.. భరత్ సరే అక్క నేను ఇప్పుడే వస్తాను అని అంటాడు.. మీనాక్షి తన కుటుంబాన్ని చూసి అవినీకి మంచి కుటుంబం దొరికింది అనే సంతోష పడుతూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పల్లవి తన ఫ్రెండ్ ని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళుతుంది. పల్లవిని చూసిన తన ఫ్రెండు షాక్ అవుతుంది.. పల్లవి నువ్వేంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది. నీతో ఒక చిన్న పని ఉంది అందుకే వచ్చాను అని అనగానే నాకోసం నువ్వు వెతుక్కుంటూ వచ్చావా..? అంటే ఏదో ఉంది అని రా ఇంట్లోకి గానీ తన ఫ్రెండ్ అంటుంది..ఎందుకు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావు ఏదైనా సమస్యలో ఉన్నావా అని అడుగుతుంది. సమస్యలు కాదు కానీ నాకు కొంచెం డబ్బులు కావాలి నువ్వు ఏర్పాటు చేయగలవా అని అడుగుతుంది. మీ నాన్న కోటీశ్వరుడు కదా మీ నాన్న నేను అడగొచ్చు కదా అని తన ఫ్రెండ్ అంటుంది… మా నాన్న నాకు ఇవ్వనని చెప్పాడు. మా వాళ్లు ఆస్తులు పోగొట్టుకున్నారు నీకు తెలియంది కాదు అని పల్లవి చెప్తుంది.
నువ్వు నీ భర్త గురించి చాలా గొప్పగా చెప్పావు. నా భర్త అమెరికాలో కంపెనీలో పని చేస్తున్నాడు అది ఇది అని చెప్పావు. కానీ నాలాంటి వాళ్ళు ఇళ్లల్లోనే కరెంటు పని చేసుకుంటున్నాడు అని తెలిసి నీ గురించి ఆలోచించాను.. నువ్వు ఎప్పుడైనా పరిస్థితి ఏంటో నాకు అర్థం అవుతుంది నీ భర్త సంపాదించేది నీకు సరిపోవడం లేదు. నీ తండ్రి నీకు ఇవ్వనని మొహం మీద చెప్పేసాడు కాబట్టి ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇస్తే నువ్వు అది ఇస్తావో లేదో తెలీదు. ఇప్పుడు పల్లవి కైతే నేను లక్ష రూపాయలు అయినా ఇచ్చేదాన్ని.. ఇప్పుడు నీకు ఇవ్వడం కుదరదు పల్లవి ఇకనుంచి వెళ్ళు అని తన ఫ్రెండు అవమానిస్తుంది.
తండ్రి ఇవ్వకపోవడంతో తన ఫ్రెండు అవమానించందని బాధపడుతూ పల్లవి బయటకు వస్తుంది. మీనాక్షి ఎక్కడుందో కనుక్కొని దాన్ని ఎలాగైనా చంపేస్తే నాకు ఏ బాధ ఉండదు అని అనుకుంటాడు. మీనాక్షి ఎక్కడుందో కనుక్కొని వాడికి ఇచ్చేస్తే వాడు చంపేస్తాడు ఆ తర్వాత నేను హ్యాపీగా ఉండొచ్చు అని చక్రధర్ తనలో తానే మాట్లాడుకుంటూ ఉండడం చూసిన పల్లవి ఎక్కడున్నాడు ఏంటి అని అక్కడికి వస్తుంది. పల్లవిని చూసిన చక్రధర్ ఆ ఫోటోని కార్లో పడేస్తాడు.. ఏంటమ్మా పల్లవి నువ్వు ఇలా నడుచుకుంటూ వస్తున్నావు కారు ఏమైంది అని అడుగుతాడు.
అదే నేను అడుగుతున్నా డాడ్.. ఒక బిజినెస్ మ్యాన్ కూతురిని అయ్యుండి కూడా నేను ఇలా నడుచుకుంటూ వస్తున్నాను అంటే.. అది మీరే చెప్పాలి దానికి కారణం ఎవరు మీరే చెప్పాలి అని అంటుంది.. నేను నీకు డబ్బులు ఇవ్వను అని చెప్పలేదు వాడికి ఇవ్వను అని చెప్పాను ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది అని చక్రధర్ అంటాడు. అయినా కానీ నువ్వు నాకు డబ్బులు ఇవ్వను అని అన్న తర్వాత ఎలా నేను మళ్లీ నీ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతానని అనుకుంటున్నావు అని పల్లవి అంటుంది.
ఇప్పుడు నీకు నీ కూతురు అవసరం లేదు ఎందుకంటే నేను ఇప్పుడు బిజినెస్మేన్ రాజేంద్రప్రసాద్ కోడల్ని కాదు కాబట్టి.. ఏదో ఒక రోజు ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత నీతో మాట్లాడతాను అని చాలెంజ్ చేసి వస్తుంది. మీనాక్షి తో అందరూ సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. అవని అమ్మ భోజనం చెయ్యని తీసుకొని వస్తుంది.. అదేంటమ్మా నా ఒక్కదానికే భోజనం తీసుకొచ్చావు అందరితో పాటే మేము తింటాం కదా అని అనగానే అవని నువ్వు తినమ్మ ముందు ఎప్పుడు తిన్నావు ఏంటో అని అంటుంది.
మేము తినడానికి చాలా టైం పడుతుంది వదిన గారు మీరు ఎప్పుడు తిన్నారో తినండి అని అంటుంది. భరత్ ఇంకా రాలేదు ఏంటమ్మా అని మీనాక్షి అవనీని అడుగుతుంది. భరత్ గురించి నీకు ఒక విషయం చెప్పాలమ్మా.. భరత్ పెళ్లి చేసుకున్నాడు అని అనగానే మీనాక్షి షాక్ అవుతుంది. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అని అడుగుతుంది. మరెవరో కాదమ్మా మా అత్తయ్య మామయ్య కూతురు నా మరదలు చాలా మంచి అమ్మాయి అని చెప్తుంది.
ఇప్పుడే అక్కడికి భరత్, ప్రణతిలు వస్తారు.. కొడుకుని చూసిన మీనాక్షి చాలా సంతోషంగా మాట్లాడుతుంది. మా నీకు చెప్పకుండా మేము పెళ్లి చేసుకున్నాను అని అంటాడు. అవని అంత చెప్పిందమ్మా.. క్షమించండి అత్తయ్య గారు. మేము మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాము అని అనగానే మీనాక్షి నీ పేరు ఏంటమ్మా అని అడుగుతుంది. నా పేరు ప్రణతి అత్తయ్య అని ఆమె ఆశీర్వాదం తీసుకుంటారు. తనకైతే అందరూ కలిసి మీనాక్షి తో సంతోషంగా గడుపుతారు.
Also Read :ప్రభావతిలో ఈ టాలెంట్ కూడా ఉందా..? కూతురు, కొడుకుతో కలిసే ఆ పని..
ఇంట్లోకి పల్లవి వస్తుంది. ఆరాధ్య గేటు బయట నిలబడి పిన్ని నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను అని అడుగుతుంది. ఏ ఎందుకు అని పల్లవి అంటుంది. అమ్మకి అమ్మ నాన్న ఎవరూ లేరు అని అనాధాని నువ్వు అవమానించావు కదా.. మా అమ్మమ్మ ఇంటికి వచ్చింది మన ఇంట్లోనే ఉంది అని పల్లవితో ఆరాధ్య అంటుంది. ఎవరు అని లోపలికి వెళ్లి ఆ పల్లవి చూస్తుంది. మా అమ్మ లేదు అని అన్నావు కదా ఈవిడే మా అమ్మ అని అవని పరిచయం చేస్తుంది. ఇన్ని రోజులు అవనికి అమ్మానాన్న లేరు అని అవమానించావు ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చారని అక్షయ్ అంటాడు. పల్లవి మీ అమ్మ వచ్చింది సరే నాన్న కూడా ఉండాలి కదా ఎక్కడ అని అడుగుతుంది. మీనాక్షి చక్రధర్ ఫోటో ని చూపిస్తుందేమో చూడాలి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..