E-Paper
Advertisement

Pooja:దేవుడి పవళింపు సేవలో ఉన్నప్పుడు పూజ చేయచ్చా…

Pooja:దేవుడి పవళింపు సేవలో ఉన్నప్పుడు పూజ చేయచ్చా…
Advertisement

Pooja:ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతీ దేవాలయానికి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల ఆచారాలు ఉంటాయి. అర్చక స్వాములు వారికున్న అనుభవం భట్టి పూజలు ఆచరిస్తుంటారు. దేవుడి పవళింపు సేవ విషయానికి వస్తే కొన్నిపద్దతులు ఉంటాయి. దేవుడు విశ్రమిస్తున్నసమయంలో పూలు వేయడం లాంటివి చేయకూడదు. పూలతో అలంకరించి స్వామిని పాన్పు మీద శయనింప చేసి పాలను నైవేద్యం పెట్టి మధురమైన పదార్ధాలను కూడా ఉంచి భగవంతుడికి సంబంధించి జోలపాట లేదా మంచి కీర్తన ఆలపించి భగవంతున్ని నిద్రింప చేయడం సంప్రదాయం.

కాని పవళింపు జరుగుతున్నప్పుడు పూల జల్లడం కొన్ని ప్రాంతాలు, సంప్రదాయాల బట్టి మారుతుంది. అర్చకులు వారి పూర్వీకులు అలాంటి పద్దతిని ఆచరిస్తే ప్రస్తుతం ఉన్న వారు ఆ పరంపరను కొనసాగించడంలో తప్పులేదు. లౌకికంగా, కాలమాన పరిస్థితులు బట్టి కూడా కొన్ని మార్పులు వస్తుంటాయి. ఏది జరిగినా పరమార్దం గ్రహించాలి. భగవంతుని వల్లే అది జరిగిందని భావించాలి. భగవంతుడి సేవపైనే దృష్టిపెట్టాలి. కానీ చిన్న చిన్న విషయాలపై కాదు. పవళింపు సేవలో ఉన్న అమ్మవారు, అయ్యవారు ఎవరైనా మనసా వాచా పూజించాలి. చిత్తశుద్ధితో ఆరాధించాలి.

Advertisement

Dharma Sandehalu:కోపంలో తల్లిదండ్రుల తిట్లు ఫలిస్తాయా…

Dharma Sandehalu:పెద్దల పాదాలకు ఎందుకు నమస్కరించాలి

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×