Surya Mangal Yuti 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, సంయోగాలు చాలా ముఖ్యమైనవి. ఈ సంయోగం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ఫిబ్రవరి 7, 2025 న సూర్యుడు కుజుడి కలయిక జరగనుంది. ఫలితంగా షడష్టక యోగం ఏర్పడుతుంది. షడష్టక యోగం వల్ల 12 రాశులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఈ యోగం 3 రాశుల వారిపై అద్భుత ప్రయోజనాలను కలిగిస్తుంది. ఏ ఏ రాశుల వారిపై షడష్టక యోగం ప్రభావం ఎక్కువగా ఉంటుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
మేష రాశి వారికి సూర్యుడు, కుజుడు కలయిక చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతోంది. ఈ జాతకులకు అన్ని శుభ కార్యాలలో విజయం సాధించే బలమైన అవకాశం ఉంది. ఇది కాకుండా వ్యాపారంలో మెరుగైన ఆదాయం కారణంగా ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆర్థిక లాభాలను తెస్తుంది.
సింహ రాశి:
సింహ రాశి వారికి సూర్యుడు , కుజుడు కలయిక వలన ఏర్పడిన షడాష్టక యోగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి వ్యాపారంలో ఆర్థిక అనుకూలంగా ఉంటుంది. మీరు విదేశాలకు సంబంధించిన వ్యాపారాల నుండి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. మీరు శుభ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మీ ఆఫీసుల్లో మీకు గౌరవం లభిస్తుంది.
ధనస్సు రాశి:
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ధనస్సు రాశి వారు సూర్యుడు , కుజుడు కలయిక కారణంగా సానుకూలంగా ఉంటారు. మీ ఆదాయంలో భారీ పెరుగుదల కారణంగా సంతోషంగా ఉంటారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనుల్లో కూడా మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి ప్రయోజనం పొందడానికి బలమైన అవకాశం ఉంటుంది.