CM Revanth Reddy: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సూచించారు. ఈరోజు జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ లైన్ దాటుతున్న నేతలపై సీరియస్‌గా ఉండాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్ లోని ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం, ఏఐసీసీ ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక గ్రామాలు ఏకగ్రీవం చేయాల్సిన బాధ్యతలు ఎమ్మెల్యేలదే అని దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో హామీల అమలుకు ముందడుగు వేయాలని.. సీసీ రోడ్లు, ఆలయాలు, నిర్మాణ అనుమతులకు, అభివృద్ధి పనులు, నిధుల మంజూరు కోసం మంత్రులను కలవాలని సీఎం ఎమ్మెల్యేలకు సూచించారు. బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల పదవులను కేటాయించే బాధ్యత కూడా ఎమ్మెల్యేలదే అని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ గెలుపే లక్ష్యంగా అందరితో కలసిి ముందుకువెళ్లి పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యచరణపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సూచనలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల చొరవతో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ మోక్షం లభించిందని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీసీ కులగణన జరిగన ఏకైన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. బీహార్ వంటి రాష్ట్రాలు కులగణన చేపట్టినా కార్యరూపం దల్చలేదని పేర్కొన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ ఈ రెండు కీలకమైన నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడి సూచించారు. బీసీ కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై.. రెండు భారీ బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సభలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ లను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సీఎల్పీ సమావేశం దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభం అయిన ఈ సీఎల్పీ మీటింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగింది. కాగా సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ నేతలు తీసుకున్న నిర్ణయాలపై అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు.
Also Read: Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సినిమా చేసేటప్పుడు అన్ కంఫర్టబుల్… బాంబ్ పేల్చిన హీరోయిన్ తండ్రి
సీఎల్పీ సమావేశంలో అనేక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ లైన్ దాటుతున్న నేతలపై సీరియస్‌గా ఉండాలని హెచ్చిరించినట్లు తెలుస్తోంది. పార్టీ విధానాలను సొంత పార్టీ నేతలే తప్పుబడితే ప్రజల్లో కన్ఫ్యూజన్ అవుతోందని చెప్పారు. పార్టీలోనే ఉంటూ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. పార్టీ విధానాలపై అనుమానాలు ఉంటే పార్టీ ఇంటర్నల్ వేదికలపై మాత్రమే చర్చించాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.