BigTV English

BEL Recruitment: బీటెక్ అర్హతతో బెల్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం.. ఇదిగో పూర్తి వివరాలు..

BEL Recruitment: బీటెక్ అర్హతతో బెల్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం.. ఇదిగో పూర్తి వివరాలు..
BEL Recruitment: బీఈ, బీటెక్, బీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో తాత్కాలిక ప్రతిపాదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా ఉంటుంది. ఈ నెల 20 వ తారీఖున దరఖాస్తు గడువు ముగియనుంది. కాబట్టి వెంటనే అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ దరఖాస్తు పెట్టుకోండి.

నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశం. భారత ప్రభుత్వ రంగ సంస్థ నవరత్న కంపెనీ అయిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL).. తాత్కాలిక విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 137

ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ట్రైనీ ఇంజినీర్-1, ప్రాజెక్ట్ ఇంజినీర్-1 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.


పోస్టుల వారీగా..

ట్రైనీ ఇంజినీర్-1 ఉద్యోగాలు: 67

ప్రాజెక్ట్ ఇంజినీర్-1 ఉద్యోగాలు: 70

విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ డిగ్రీ పాస్ తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సు ఉంటుంది. ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగానికి 28 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ ఉద్యోగానికి 32 ఏళ్లు మించరాదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగానికి మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.35,000 ఉంటుంది. మూడో ఏడాదికి రూ.40,000 ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగానికి మొదటి ఏడాది రూ.40,000 ఉంటుంది. రెండో ఏడాది రూ.45,000 ఉంటుంది. మూడో ఏడాది రూ.50,000 ఉంటుంది. నాలుగో ఏడాది రూ.55,000  జీతం కల్పిస్తారు.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ట్రైనీ ఇంజినీర్ పోస్టుకు రాత పరీక్ష, షార్ట్ లిస్టింగ్ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగానికి రాతపరీక్ష, ఇంటర్వ్యూ, తదితర ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులకు రూ.150+జీఎస్‌టీ ఉంటుంది. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు రూ.400+జీఎస్‌టీ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా:  డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, ప్రొడక్ట్‌ డెవెలప్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, ప్రొఫెసర్‌ యూఆర్‌ రావు రోడ్‌, నాగాలాండ్‌ సర్కిల్‌, జళహల్లి పోస్టు, బెంగళూరు చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేది: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 20వ తేదీ లోపు అప్లికేషన్ పెట్టుకోవాలి.

Also Read: Green Cloths During Surgery: సర్జరీ టైమ్‌లో డాక్టర్లు ఆకుపచ్చ రంగు దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు

పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://bel-india.in/

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×