
Floating Lights: సాధారణంగా దీపం అంటే.. నూనెతో వెలిగించడమే మనందరికి తెలుసు.ఇక రాబోతున్న దీపావళికి నూనెతో ప్రమిదలు, కొవ్వొత్తులు వెలిగించాలంటే చాలా నూనె అవసరం ఉంటుంది. అలా కాకుండా.. కాస్త మోడ్రన్‌గా విద్యుత్ దీపాలు, ఎల్ఈడీ వెలుగుల తోరణాలతో అలంకరించేద్దాం ఈసారి. అదెలాగో చూద్దాం రండి.
ఇప్పుడు నూనె ఖర్చు లేకుండా నీటితో కూడా వెలిగే దీపాలు వచ్చేశాయి. వీటిని నీళ్లల్లో వేస్తే వెలుగుతాయి. ఇవి ‘ఫ్లోటింగ్ ఎల్‌ఈడీ లైట్స్’ బ్యాటరీ సాయంతో పని చేస్తాయి. గుమ్మం ముందు పళ్లెంలోనో, పూజగది ఎదురుగానో నీళ్లల్లో అలంకరిస్తే చాలు.. పండగ శోభంతా మీదే! నీరు తీసేయగానే దీపం ఆగిపోతుంది. బ్యాటరీ వేస్తే దాదాపు 48 గంటలపాటు నిరంతరాయంగా వెలుగుతుందట. ఈ దీపావళికి మనమూ నీటి దీపాలు ప్రయత్నిద్దామా.