Bandla Ganesh: బండ్ల గణేష్ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకన్నారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇలా నిర్మాతగా బండ్ల గణేష్ (Bandla Ganesh) ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల గురించి తరచూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఇటీవల కాలంలో బండ్ల గణేష్ వరుసగా సినిమా వేడుకలలో కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ చేతికి మైక్ దొరికితే చాలు ఆయనకు పూనకం వచ్చేస్తుంది. ఇలా పలు సినిమా వేదికలపై ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో విమర్శలకు కూడా కారణం అయ్యాయి. అయితే ఇటీవల కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన కే రాంప్ (K-Ramp) సినిమా రాంపేజ్ ఈవెంట్ కార్యక్రమంలో బండ్ల గణేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ క్షమాపణలు తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఎక్స్ వేదికగా బండ్ల గణేష్ స్పందిస్తూ..” ఇటీవల కే రాంప్ సినిమా సక్సెస్ మీట్ లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు.. నా ఉద్దేశం అందరూ బాగుండాలి.. కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే అంటూ క్షమాపణలు చెప్పకనే చెబుతూ వివరణ ఇచ్చుకున్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.
ఇటీవల కె రాంప్ సినిమా సక్సెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు.
నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే.మీ బండ్ల గణేష్
— BANDLA GANESH. (@ganeshbandla) November 5, 2025
అనాల్సిన మాటలన్నీ అని.. ఇప్పుడు ఇలా వివరణ ఇవ్వటం అవసరమా బండ్లన్న.. మాట్లాడేటప్పుడే కాస్త జాగ్రత్త పడితే సరిపోయేది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కిరణ్ అబ్బవరం ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వరుస హిట్ సినిమాలను అందుకుంటున్న ఎలాంటి గర్వం లేదని కొంతమంది ఒక హిట్ కొడితేనే చిరిగిన ప్యాంట్లు వేసుకొని అర్ధరాత్రి కూడా కళ్ళజోడు పెట్టుకొని వాట్సాప్ అంటూ మాట్లాడుతారు. ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవాలంటే దిల్ ఉండాలి కానీ వాట్సాప్ అంటే హిట్లు రావని బండ్ల గణేష్ ఒక హీరోని టార్గెట్ చేస్తూ మాట్లాడారు అయితే ఈయన టార్గెట్ చేసింది విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)నే అని స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు బండ్ల గణేష్ పై విమర్శలు కురిపిస్తున్నారు.
Also Read: R.K.Roja గుర్తుపట్టలేని స్థితిలో సినీనటి రోజా .. ఇలా మారిపోయిందేంటీ?