Bigg Boss 9 Promo : బిగ్ బాస్ సీజన్ 9 59 రోజులు పూర్తయిపోయింది. 59వ రోజు ఎప్పటిలాగానే ఆసక్తికరమైన విషయాలు జరిగాయి. కామనర్స్ మరియు సెలబ్రిటీస్ హౌస్ లోకి మొదట ఎంట్రీ ఇచ్చారు. అయితే సరిగ్గా ఇది వారాల్లో ఆరుగురుని హౌస్ నుంచి బయటికి పంపించేశారు. ఆరుగురిని బయటకు పంపించిన వెంటనే మరో ఆరుగురిని లోపలికి పంపించే ప్రయత్నం చేశారు. దానికి పవర్ స్ట్రోమ్ అనే పేరు పెట్టి వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో ఆరుగురిని లోపలికి పంపించిన సంగతి తెలిసిందే.
గౌరవ గుప్తా, నిఖిల్, అలేఖ్య చిట్టి పీకిల్స్ రమ్య, దువ్వాడ మాధురి, ఆయేషా, శ్రీనివాస్ సాయి వీళ్ళ ఆరుగురు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే కామనర్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి మరియు రమ్య మోక్ష ఆల్రెడీ ఎలిమినేట్ వెళ్ళిపోయారు. వీళ్ళందర్లో కల్లా గౌరవ్ మీద అందరికీ కొద్దిపాటి మంచి అభిప్రాయమే ఉంది. ఎక్కువ సందర్భాల్లో గొడవపడడు. కానీ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన ప్రోమోలో గౌరవ్ గొడవ గట్టిగా వినిపిస్తుంది.
ప్రస్తుతం హౌస్ లో దివ్య కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. కెప్టెన్ దివ్యకు మరియు గౌరవ్ మధ్య విపరీతమైన ఆర్గ్యుమెంట్ జరిగింది. రేషన్ మేనేజర్ గా రీతు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మిల్క్ విషయంలో ఏదో తేడా వచ్చింది. తనకు మిల్క్ అందకపోవడం వలన రీతుతో గొడవ పడాల్సి వచ్చింది.
రేషన్ మేనేజర్ గా అవైలబుల్ గా ఉండాలి అంటూ గౌరవ్ రీతుతో అంటున్నాడు. అయితే 24 గంటలు ఆవిడ ఫ్రిడ్జ్ పట్టుకొని కూర్చోలేదు కదా అని దివ్య గౌరవ్ ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేసింది. నువ్వు రేషన్ మేనేజర్ అయితే అలానే చేస్తావా అని అడిగితే అవును నేను రేషన్ మేనేజర్ అయితే అన్నిటికి నేను బాధ్యత తీసుకుంటాను అని గట్టిగా చెప్పేసాడు.
ఇలా జరుగుతున్న ఆర్గుమెంటులోనే నువ్వు రేపటి నుంచి వాష్ రూమ్ డ్యూటీ చేయాలి అంటూ కెప్టెన్ గౌరవ్ కి చెప్పింది. గౌరవ నేను చేయను అని చెప్పేసాడు. చేయకపోతే ఫుడ్ ఉండదు అంటూ దివ్య మాట్లాడ్డం మొదలుపెట్టింది. అయితే వీకెండ్ లో జరగబోయే ఎపిసోడ్లో ఈ ప్రస్తావన వస్తుంది అని ఈ ప్రోమో చూస్తే అనిపిస్తుంది. ముఖ్యంగా ఎప్పుడు గట్టిగా మాట్లాడని గౌరవ్ ఈసారి మాత్రం ఇద్దరికి ఇచ్చి పడేసాడు.
Also Read: Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?