BigTV English
Advertisement

Yama:యముడు పంపే నాలుగు సంకేతాలు

Yama:యముడు పంపే నాలుగు సంకేతాలు

Yama:పుట్టిన వారికి మరణం తప్పదని భగవద్గీతలో కృష్ణుడు. ఆ మరణం జరిగిన తర్వాత ప్రాణాన్ని తీసుకెళ్లేది యమధర్మరాజు. అందుకే యముడు పేరు చెప్పగానే భయం కలగడం సహజం. యమధర్మరాజు కూడా మన ప్రాణాలను తీసుకెళ్లే ముందు మనకు నాలుగు సంకేతాలను పంపుతారట., మన నుంచి ప్రాణాన్ని వేరు చేసేది మాత్రం యమ ధర్మరాజు అన్న సంగతి మనకు తెలిసిందే. మనలో చాలా మందికి ఆయన పట్ల భయము, భీతి ఉంటుంది.


యమునా నదీ తీరం లో అమృతుడు అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడట. అతనికి ఎపుడు చూసినా తాను చనిపోతానేమో అని.. ఎపుడు చనిపోతానో అని ఒక దిగులుగా ఉండేదట. ఈ విషయంలో దిగులు పోగొట్టుకోవడం కోసం యమ ధర్మ రాజుని ఉద్దేశించి తపస్సు చేసాడట. అతని తపస్సుకి మెచ్చి యమధర్మ రాజు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడట. అయితే, ఆ వ్యక్తి తనకి మరణం ఎప్పుడు వస్తుందో ముందుగానే తెలియచేయమన్నాడట. ఆ విషయం ముందే తెలిస్తే తన బాధ్యతలన్నీ మరొకరికి అప్ప చెప్పేయాలనేది అతని ఆలోచన. 0

అయితే యమధర్మ రాజు మరణం ఎప్పుడు వస్తుందో చెప్పలేనని, అయితే అందుకు గుర్తు గా కొన్ని సంకేతాలను మాత్రం పంపగలనని తెలిపాడట. వాటిని బట్టి మరణం వచ్చే విషయం తెలుసుకోవాలని యమధర్మరాజు సూచించారు. ఆ తరువాత ఈ విషయాన్నీ అమృతుడు మర్చిపోతాడు. పెళ్లి చేసుకోవడం, పిల్లలని కనడం, వారికి కూడా పెళ్లిళ్లు అవ్వడం ఇలా కాలం గడిచిపోతుంది. అలా ఓ రోజు అమృతుడికి యమధర్మరాజు తో జరిగిన సంభాషణ గుర్తుకు వస్తుంది.


యముడు చెప్పిన సూచనలు ఏవి కనిపించకపోవడం తో తనకు ఇంకా ఆయువు ఉందని అమృతుడు అనుకుంటాడు. కాలక్రమం లో అతని చర్మం ముడతలు పడుతుంది, వెంట్రుకలు తెల్లబడతాయి. పళ్ళు కూడా ఊడిపోతాయి. పక్షవాతం సోకి మంచానికే పరిమితం అవుతాడు. ఓ రోజున యమధర్మరాజు అతని ప్రాణాలు తీసుకుని పోవడానికి వస్తాడు. అయితే, అమృతుడు ఆశ్చర్యం తో నాకు సూచనలు చేస్తానని మాటిచ్చావు. కానీ, ఎలాంటి సూచనలు ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతున్నావు. నువ్వు నాకిచ్చిన వరం మాటేమిటి? అని అడుగుతాడు. నేను నీకు నాలుగు సార్లు సూచనలు చేసినప్పటికీ, నువ్వు గ్రహించలేదు అని చెబుతాడు. ఆ సూచనలేమిటని అమృతుడు యముడిని అడగ్గా, వెంట్రుకలు తెల్లబడడం, చర్మం ముడుచుకోవడం, పళ్ళు ఊడిపోవడం, పక్షవాతం వంటి అనారోగ్యాలను తానూ పంపిన సూచనలు గా యముడు వివరిస్తాడు. అప్పుడు అమృతుడుకి కి విషయం అర్ధం అవుతుంది. అమృతుడు నిజాన్ని ఒప్పుకున్నతరువాత యమధర్మరాజు అతని ప్రాణాలను తీసుకెళ్ళిపోతాడు.

Related News

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. ఏడాదంతా దీపారాధన చేసిన ఫలితం

Golden Temple Telangana: హైదరాబాద్‌‌‌కు సమీపంలో బంగారు శివలింగం.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా?

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట ‘కాసుల వర్షం’ ఖాయం !

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి.. విశిష్టత ఏంటి ?

Big Stories

×