BigTV English

Garuda Puranam: ఆ పనులు చేస్తే మనిషి ఆయుష్షు తగ్గిపోతుందట – అసలు గరుడపురాణం ఏం  చెప్తుందంటే..?

Garuda Puranam: ఆ పనులు చేస్తే మనిషి ఆయుష్షు తగ్గిపోతుందట – అసలు గరుడపురాణం ఏం  చెప్తుందంటే..?

Garuda Puranam: తెలిసి గానీ తెలియకుండా కానీ కొన్ని పనులు చేయడం వల్ల మనుషుల ఆయుష్షు క్షీణిస్తుందని.. ఆ వ్యక్తులకు మరణం సంభవిస్తుందని గరుడపురాణం ఘోషిస్తుందని పండితులు చెప్తున్నారు. ఆ పనులేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.


ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం: గరుడ పురాణలో శ్రీ మహా విష్ణవు చెప్పినట్టు ఎవరైతే ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తారో అటువంటి వ్యక్తుల ఆయుష్షు తగ్గిపోతుందట. జీవితంలో కష్టాలు వస్తాయని ఆలస్యంగా నిద్ర లేచే వారికి జీవితంలో ఎటువంటి పని చేసినా విజయం దక్కదని అలాగే  వారి జీవినశైలిలో వచ్చే మార్పులు వల్ల  వారికి త్వరగా మరణం సంభవిస్తుందట. అలా కాకుండా ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తారో అలాంటి వ్యక్తులు తమ జీవితంలో అద్బుతాలు చూస్తారట.

రాత్రి పూట పెరుగు తినడం: ఎవరైతే రాత్రి పూట పెరుగును తింటారో అలాంటి వారి ఆయుష్షు కూడా తగ్గుతుందని గరుడపురాణం ఘోషిస్తోందని పండితులు చెప్తున్నారు. పెరుగు ఎప్పుడు తిన్నా ఒంటకి మంచిదే కానీ రాత్రి పూట తినకూడదని హెచ్చరిస్తున్నారు. అయితే పెరుగుకు బదులు పాలు తాగడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. రాత్రి పూట పాల తాగడం వల్ల మంచి నిద్ర పడుతుందట. అలాగే జీవిత కాలం రేటు పెరుగుతుందట.


రాత్రి మిగిలిన ఆహారం లేదా మాంసం తినడం: గురుడ పురాణ ప్రకారం రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకోవడం నిషిద్దమట. అలా రాత్రి మిగిలిపోయిన ఆహారం తీసుకోవడం వల్ల ఆయుః క్షీణం అవుతుందని పండితులు చెప్తున్నారు. అలాగే రాత్రి పూట మిగిలిపోయిన మాంసం తీసుకోవడం ఇంకా ప్రమాదం అంటున్నారు. మిగిలిపోయిన మాంసం తినడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా వైద్య పరంగా కూడా చాలా సమస్యలు వస్తాయంటున్నారు.

చీకటి గదిలో నిద్రించడం: ఎవరైతే నిద్రిస్తున్న గదిలో పూర్తిగా చీకటి ఉంటుందో అలాంటి వ్యక్తుల ఆయువు తగ్గిపోతుందని గరుడపురాణంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. నింద్రించే గదిలో ఎప్పుడూ కొద్దిగానైనా వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలా కాకుండా పూర్తి చీకటి గదిలో నిద్రించడం శాస్త్ర విరుద్దం అంటున్నారు.

విరిగిన మంచంపై పడుకోవడం: ఎవరైతే విరిగిన మంచం మీద పడుకుంటారో వారికి ఆయుష్సు తగ్గిపోతుందని గరుడపురాణంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. మంచాన్ని రెండో పాడే అంటారని.. మనిషి నిద్ర పోవడాన్ని రెండవ చావు అంటారని.. కాబట్టి మంచం విరిగినప్పుడు అది పాడెతో సమానమని అందుకే మనిషి బతికుండగానే పాడె మీద  పడకుంటే ఆ వ్యక్తి జీవితకాలం తగ్గుతుందని పండితులు చెప్తున్నారు.

తప్పుడు వ్యక్తులకు సాయం చేయడం: సమాజానికి కీడు చేసే వ్యక్తులకు సాయం చేసే వ్యక్తులకు కూడా ఆయుష్షు తగ్గిపోతుందని గరుడపురాణంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. చెడు చేసే వాడికి సాయం చేస్తే చెడు చేసిన దానికంటే ఎక్కువ చెడు కర్మలను అనుభవించాల్సి వస్తుందని.. అందుకే చెడు వ్యక్తులకు సాయం చేయకూడదని పెద్దలు చెప్తుంటారు. అలాగే ఇన్‌డైరెక్టుగా మీరు కూడా ఆ చెడు చేసినట్టేనని అందువల్లే చెడు వ్యక్తులు తెలిసి గానీ తెలియక గానీ సాయం చేస్తే మీ ఆయుష్సు క్షీణిస్తుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ:  సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం –  అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు

 

Related News

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Big Stories

×