Karur Stampade: తమిళనాడులోని కరూర్ ర్యాలీ సందర్భంగా టీవీకే చీఫ్ విజయ్ వ్యవహరించిన తీరు వల్లే తొక్కిసలాట జరిగిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు పోలీసులు. విజయ్ సాయంత్రం 4.45 గంటలకే కరూర్ జిల్లా సరిహద్దుకు వచ్చినా.. అక్కడ వాహనాల్ని ఆపి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని తెలిపారు. అనుమతి లేకున్నా రోడ్ షో నిర్వహించారన్నారు.
విజయ్ వైపు జనం దూసుకురావడంతో తొక్కిసలాట..
తన వాహనాన్ని జనం మధ్యంలో పార్క్ చేయడంతో.. విజయ్ వైపు జనం దూసుకురావడంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోందని పార్టీ నేతలను హెచ్చరించినా పట్టించుకోలేదని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
కరూర్ జిల్లా టీవీకే పార్టీ సెక్రటరీ అరెస్ట్ చేసిన పోలీసులు
కొందరు అక్కడ వేసిన టెంపరరీ షెడ్లు, చెట్లు ఎక్కారని.. షెడ్లు కూలిపోయి వాళ్లంతా కిందపడ్డారని తెలిపారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని.. జనాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే లాఠీఛార్జ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ఎఫ్‌ఐఆర్‌లో విజయ్ పేరు మాత్రం చేర్చలేదు పోలీసులు. కరూర్ జిల్లా టీవీకే సెక్రటరీని అరెస్ట్ చేశారు పోలీసులు. టీవీకే జనరల్ సెక్రటరీ, జాయింట్ జనరల్ సెక్రటరీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కరూర్ తొక్కిసలాట ఘటనపై ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు..
విజయ్ మాట్లాడే సమయంలో.. కొంత సమయం కరెంట్ కట్ చేయాలంటూ టీవీకే పార్టీ నేతలే కోరారని తెలిపింది తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు. కానీ తాము నిరాకరించామని తెలిపారు అధికారులు. కాగా.. తొక్కిసలాట వెనుక కుట్ర కోణం ఉన్నదని.. విజయ్ వేదిక వద్దకు రాగానే పవర్ కట్ చేశారంటూ ఆరోపించారు టీవీకే నేతలు.
Also Read: 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి వేలాడుతూ వ్యక్తి హంగామా
తొక్కిసలాటపై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్ అరెస్ట్..
మరోవైపు.. కరూర్ తొక్కిసలాట ఘటనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఓ యూట్యూబర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. 25 సోషల్ మీడియా అంకౌట్లపై కేసులు నమోదు చేశారు. కాగా.. తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే కీలక నేత అరెస్ట్
కేసులో టీవీకే పశ్చిమ జిల్లా కార్యదర్శి మదియళగన్ అరెస్ట్
ప్రధాన కార్యదర్శి ఆనంద్ ఫోన్ స్విచ్ ఆఫ్.. ఆచూకీ గల్లంతు
ఘటనపై జ్యుడీషియల్ విచారణకు సీఎం స్టాలిన్ ఆదేశం
కాగా, విజయ్ ప్రచారసభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన సంగతి… https://t.co/Sq6xAFoZcF pic.twitter.com/SjFq1lp5gE
— BIG TV Breaking News (@bigtvtelugu) September 30, 2025