RCB – Lalit Modi: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup Trophy 2025) ముగిసిన నేపథ్యంలో… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore team ) గురించి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు ప్రముఖ వ్యాపారవేత్త లలిత్ మోడీ ( Lalit Modi ). ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును ( Indian Premier League Tournament ) జనాలందరికీ అలవాటు చేసిన లలిత్ మోడీ… ఒకప్పుడు ఐపీఎల్ కు చైర్మన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనే మొట్టమొదటి చైర్మన్ కావడం గమనార్హం. దాదాపు మూడు సంవత్సరాల పాటు చైర్మన్ గా కొనసాగిన లలిత్ మోడీ ప్రస్తుతం లండన్లో ఉంటున్నారు.
Also Read: Arshdeep Singh: పాకిస్థాన్ ను దారుణంగా ట్రోల్ చేసిన అర్ష్ దీప్…Final Match, What’s Happening…అంటూ
లండన్ లోనే ( London) ఉంటున్న లలిత్ మోడీ తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) జట్టు అమ్మకం పైన సంచలన పోస్ట్ పెట్టారు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కంటే ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును విక్రయించబోతున్నారని బాంబు పేల్చారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ పూర్తి అయ్యాయని… కొనేవారు ఉంటే కచ్చితంగా.. ఆ ఫ్రాంచైజీ ఓనర్లు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పోస్ట్ పెట్టారు. దీంతో లలిత్ మోడీ పెట్టిన పోస్టు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లలీత్ మోడీ ఈ పోస్టు చేయడంతో… సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ జట్టును లలీత్ మోడీనే కొనుగోలు చేయనున్నారని కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే రాయల్ ఛాలెంజర్స్ జట్టును విక్రయిస్తే.. రూ.17000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. అంత మొత్తంలో డబ్బును సిద్ధం చేసుకుని.. ఈ పోస్టును లలీత్ మోడీ పెట్టాడని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Asia Cup 2025 : రింకూ సింగా మజాకా.. కార్డు పైన రాసి మరి… విన్నింగ్ షాట్ ఆడాడు.. అదృష్టం అంటే అతడిదే
There have been a lot of rumour about the sale of an @IPL franchise specifically @RCBTweets – well in the past they have been denied. But it seems the owners have finally decided to take it off their balance sheet and sell it. I am sure having won the IPL last season and also… pic.twitter.com/ecXfU5n5v5
— Lalit Kumar Modi (@LalitKModi) September 29, 2025