MLA Madhavi Reddy: దేశ వ్యాప్తంగా ఆగస్టు 15 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 79వ స్వాతంత్ర్య వేడుకలకు అధికారులు అందరూ హాజరై జాతీయ పథాకం ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన ఆలకించారు.అయితే వైఎస్పార్ కడప జిల్లాలో ప్రజాప్రతినిధికి, అధికారులకు మధ్య ప్రోటోకాల్ విషయంలో వివాదం నెలకొంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్, ఎమ్మెల్యేల రగడ చర్చకు దారితీసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతుంటే కలెక్టర్, ఎమ్మెల్యేల వాదోపవాదనలతో అక్కడకు వచ్చిన ప్రజలు, అధికారులు షాక్‌కి గురయ్యారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. కడప పోలీస్ గ్రౌండ్స్‌లో కార్యక్రమం నిర్వహించారు. దీనికి అతిధులుగా ఎమ్మెల్యే మాధవి రెడ్డి హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యే మాధవిని జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ఆహ్వానం పలికారు. దీంతో అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే మాధవి, కలెక్టర్ పై చిందులు వేశారు. ఒక ఎమ్మెల్యే వస్తుందని తెలిసి కూడా ఏర్పాటు చేసిన సభపై కుర్చీ ఎందుకు వేయలేదని కలెక్టర్ పై కోపాన్ని వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేకి ఇదేనా మీరిచ్చే గౌరవం అంటూ కలెక్టర్ పై ఫైర్ అయ్యారు. నన్ను ఆహ్వనించినప్పుడు కుర్చీ వేయాలని తెలియదా? అని అందరి ముందు కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ అధికారులు చూస్తుండగా కలెక్టర్ అతిథి పై ఎమ్మెల్యే మాధవి ఫైర్ అవుతుండగా ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.
నన్ను ఆహ్వానించారు సరే.. మరి ఎందుకు కుర్చీ వేయలేదు అంటూ జాయింట్ కలెక్టర్ అతిథిని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆగ్రహానికి కలెక్టర్ అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత వెళ్లి ఎమ్మెల్యేను ఆహ్వానించినా రానంటూ తిరస్కరించింది. చివరివరకూ నిలబడే కార్యక్రమాలను తిలకించింది. ఎమ్మెల్యే వేదికపై వెళ్ళక పోవడంతో వేదికపై ఖాళీ సీటు దర్శనమిచ్చింది. కార్యక్రమం ముగించే వరకు ఎమ్మెల్యే తిలకింది అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో అక్కడున్న ప్రజలు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళా ఎమ్మెల్యే అయి ఉండి మరో మహిళా జాయింట్ కలెక్టర్ పై ఆగ్రహించిన తీరుపై సర్వత్రా చర్చకు దారితీసింది.
జాయింట్ కలెక్టర్‌పై ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆగ్రహం
కడప పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
వేదికపై తనకు కుర్చీ లేదని జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం
ఆ తర్వాత ఆహ్వానించినా తిరస్కరించి, చివరివరకూ నిలబడే కార్యక్రమాలను… pic.twitter.com/zD51GcKBcE
— BIG TV Breaking News (@bigtvtelugu) August 15, 2025