Watch Video : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పడం ఎవ్వరికైనా కష్టమే. కొన్ని సార్లు బౌలర్లు బ్యాటర్లుగా మారి విజృంభిస్తారు. కొంత మంది బ్యాటర్లు కూడా బౌలింగ్ లో రాణిస్తున్నారు. వాళ్లు ఆల్ రౌండర్లుగా మారుతున్నారు. చాలా సందర్భాల్లో ఈ మధ్య కాలంలో క్రికెట్ లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు క్రికెట్ అభిమానించే వారు కూడా రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నారు. కొన్ని దేశాలు క్రికెట్ ఆడనవి కూడా క్రికెట్ ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇక ఇండియా కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆసియా కప్ 2025లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే.
Also Read : Arshdeep Singh : పాకిస్తాన్ అభిమానికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన అర్ష్ దీప్… వాడు ఏడవడం ఒక్కటే తక్కువ
ఈ విజయం తో ఇండియా అంతటా సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. కానీ కేవలం ఇండియాలోనే కాదు.. టీమిండియా (Team India) విక్టరీని పాకిస్తాన్ లో కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. వాస్తవానికి ఇది వినడానికి విచిత్రంగా ఉండవచ్చు. కానీ ఇది నిజం. పాకిస్తాన్ సొంత గడ్డ పై జై హింద్ నినాదాలు చేశారు. ముఖ్యంగా భారత్ ఆసియా కప్ గెలిచిన తర్వాత పాకిస్థాన్‌లోని ఆఫ్ఘనిస్థాన్ విద్యార్థులు ‘జై హింద్’ అంటూ నినాదాలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్గానిస్తాన్ విద్యార్థులు గుంపులు గుంపులుగా జరుపుకుంటున్న దృశ్యాలు.. వారి నినాదాలు హైలెట్ అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారిలో ఒకరూ అప్గానిస్తాన్ ఇండియా భాయ్ భాయ్ అని వ్యాఖ్యానించడం.. మరొకరూ భారత్-అప్గానిస్తాన్ లోతైన వ్యక్తుల మధ్య సంబంధాన్ని కలిసి ఉందని కామెంట్స్ చేశారు.
చాలా కాలం నుంచి భారత్-అప్గానిస్తాన్ రెండు దేశాల మధ్య మంచి సన్నిహిత వాతావరణం ఉన్న విషయం తెలిసిందే. ఇక బీసీసీఐ సైతం అప్గానిస్తాన్ లో క్రికెట్ అభివృద్ధి కోసం నిధులు సైతం కేటాయించి.. ఆదేశంలో క్రికెట్ డెవలప్ మెంట్ కోసం నిధులు సైతం కేటాయించి ఆ దేశంలో క్రికెట్ డెవలప్ మెంట్ కోసం ఎంతో శ్రమించింది. అలాగే అప్గాన్ ప్లేయర్లకు ఎంతో విలువైన క్రికెట్ ట్రైనింగ్ కూడా ఇప్పించింది. అప్గానిస్తాన్ క్రికెట్ కోసం భారత్ ఎంతో తోడ్పాటు అందించింది. అందుకే అప్గాన్ పౌరులకే టీమిండియా అంటే అభిమానం. వేరే దేశంతో ఆడుతున్న సమయంలో కూడా చాలా మంది అప్గాన్ పౌరులు టీమిండియా కే మద్దతు ఇస్తుంటారు. మరోవైపు ఇటీవల అప్గానిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన సమయంలో అప్గానిస్తాన్ ( Afghanistan) లో బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అయితే దాదాపు లక్ష మంది వరకు హాజరై ఈ మ్యాచ్ ను చూశారు. అప్గానిస్తాన్ వాళ్లు రాను రాను క్రికెట్ అంటే ప్రాణం ఇచ్చేలా ఉన్నారుగా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం గమనార్హం.
Afghanistan students in Pakistan chanting 'Jai Hind' after India's Asia Cup win. 🤯 pic.twitter.com/ndMq0fqhWx
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 29, 2025