Nani Sujeeth :నేచురల్ స్టార్ నాని (Nani) ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకున్నారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ కొత్త టాలెంట్ ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. అలా ఆ చిన్న చిత్రాలతో భారీ సక్సెస్ కూడా అందుకుంటున్న విషయం తెలిసిందే. అలా చిన్న సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు నాని.
సుజీత్ దర్శకత్వంలో నాని కొత్త మూవీ..
మరొకవైపు వరుస సినిమాలు ప్రకటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ఇప్పుడు ది ప్యారడైజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మరొకవైపు తన కొత్త మూవీని కూడా ప్రకటించనున్నారు. అందులో భాగంగానే తన కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను దసరా రోజు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
రిలీజ్ డేట్ అప్పుడే..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో నాని తన కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను అక్టోబర్ 2ను దసరా సందర్భంగా గ్రాండ్గా నిర్వహించి ఆ తర్వాత డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
నిర్మాతలు ఎవరంటే..?
ఈ చిత్ర నిర్మాతల విషయానికి వస్తే.. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇదివరకే ఈ నిర్మాతలు నానితో శ్యామ్ సింగరాయ్ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ నానితో సినిమా చేయబోతుండడంతో అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే తెలియనున్నట్లు సమాచారం.
ALSO READ:SSMB 29: టార్గెట్ ఫిక్స్ చేసిన జక్కన్న.. అయోమయంలో మహేష్!
సుజీత్ కెరియర్..
సుజీత్ విషయానికి వస్తే.. రన్ రాజా రన్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. ప్రభాస్ తో సాహో సినిమా చేసి పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు . అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేసి పర్వాలేదు అనిపించుకున్నారు. ఇక ఇప్పుడు నానితో కొత్త సినిమా చేయబోతున్నారు అయితే ఈ సినిమాకి భారీ బడ్జెట్ కేటాయించడమే కాకుండా భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాని రూపుదిద్దుతున్నట్లు సమాచారం. మరి వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
ది ప్యారడైజ్ సినిమా విశేషాలు..
నాని ది ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం 1980 లలో సికింద్రాబాద్లో ఒక అణగారిన వివక్షకు వ్యతిరేకంగా పోరాటం ఎలా చేయబడింది అనే కథాంశంతో రాబోతోంది. ఊహించని నాయకుడి మార్గదర్శకత్వంలో పౌరసత్వం కోసం అక్కడి ప్రజలు పోరాటతీరును ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు.