JEE Main-2026: వచ్చేఏడాది-2026లో ఐఐటీ మెయిన్స్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు కీలక సూచనలు. దీనికి సంబంధించి విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ- NTA కీలక సూచనలు చేసింది. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అప్లికేషన్, ఆ తర్వాత అడ్మిషన్ ప్రక్రియలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముఖ్యమైన డాక్యుమెంట్లను చెక్ చేయాలని సూచించింది. అంతేకాదు వాటిని అప్‌డేట్ చేయాలని పేర్కొంది.
ఐఐటీ మెయిన్స్ రాసేవారికి సూచన
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌కు దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి రెండున్నర లక్షల మంది ఉంటారు. జేఈఈ మెయిన్‌కు అక్టోబరులో దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది. ఇకపై ప్రతీ ఏటా రెండుసార్లు పరీక్ష జరుగుతాయి. తొలుత జనవరి, ఆ తర్వాత ఏప్రిల్‌లో పరీక్ష జరుగుతుంది. ఈసారీ ఆ నెలల్లో ఎగ్జామ్స్ జరగనుంది.
ఈ విషయాన్ని జాతీయ పరీక్షల సంస్థ-NTA స్వయంగా వెల్లడించింది. అడ్మిషన్ సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా కొన్ని సూచనలు చేసింది. ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ అంటే పదో తరగతి సర్టిఫికెట్ ప్రకారం ఉండాలి. తాజాగా కొత్త ఫొటో, అడ్రస్, తండ్రి పేరు వంటి వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది.
ఏమైనా పొరపాట్లు ఉంటే ముందుగా సరి చేసుకోవాలని పేర్కొంది. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్, ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, దివ్యాంగుల ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని తెలియజేసింది. జేఈఈ మెయిన్స్-2026 అప్‌డేట్ చేయాల్సిన కీలక డాక్యుమెంట్లు చూద్దాం. ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ అంటే 10వ తరగతి సర్టిఫికెట్ ప్రకారం ఉండాలి.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సలహా ఏంటి?
లేటెస్ట్ ఫోటో, అడ్రస్, తండ్రి పేరు ఖచ్చితంగా ఉండాలని పేర్కొంది. వికలాంగుల కోసం యూడీఐడీ కార్డు చెల్లుబాటులో ఉండాలి. దీనికోసం అవసరమైతే రెన్యువల్ చేయించుకోవాలి. వాటిలో పొరపాట్లు ఉంటే అప్లికేషన్ తిరస్కరించవచ్చు. తక్షణమే అప్‌డేట్ చేసుకోవడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రారంభమైనప్పుడు అంతా సాఫీగా జరుగుతుంది.
చివరి నిమిషం ఎలాంటి ఒత్తిడి ఉందని పేర్కొంది. ఇక అభ్యర్థులు సూచనల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను nta.ac.in, jeemain.nta.nic.in క్రమం తప్పకుండా చూడాలని తెలియజేసింది. దేశంలోని ఉత్యున్నత విద్యాసంస్థలు ఐఐటీల్లో ప్రవేశం కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత పరీక్ష.