Tirupati: తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని గురవరాజుపల్లిలో ఓ వ్యక్తి 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కడం కలకలం రేపింది. ఏం జరిగిందో తెలియదు కానీ, అర్థరాత్రి పూట రెండు గంటల సమయం నుంచి టవర్ ఎక్కి కూర్చొన్నాడు. అతను కర్ణాటకకు చెందిన శివాని అనే వ్యక్తిగా గుర్తించారు. గ్రామస్తులు అతడిని కిందకి దింపేందుకు ప్రయత్నించారు. కానీ వారి ఫలితాలు ఏమి ఫలించలేదు.. దీంతో తెల్లవారిన తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి అతడిని కిందికి దింపేందుకు ప్రయత్నించారు.
Also Read: వామ్మో.. బంగారం ధర రికార్డు బ్రేక్.. ఇంకా బంగారం కొన్నట్లే..
సమీప పొలాల్లోని 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి రభస..
చివరకు అతడు కిందికి దూకడంతో నెట్ ద్వారా అతడ్ని రక్షించారు పోలీసులు. విద్యుత్ టవర్ లైన్ ఎక్కింది కర్ణాటకకు చెందిన శివానిగా గుర్తించారు. తిరుమల దర్శనం కోసం వచ్చిన ఆయన.. తోటి వారికంటే వెనుకబడి పోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, ఇలా విద్యుత్ టవర్ ఎక్కి హడలెత్తించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యుత్ టవర్ ఎక్కి వేలాడుతూ వ్యక్తి హంగామా
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గురవరాజుపల్లిలో ఘటన
సమీప పొలాల్లోని 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి రభస
అర్ధరాత్రి రెండు గంటల నుంచి టవర్‌పైనే ఉన్న వ్యక్తి
టవర్ ఎక్కిన వ్యక్తిని కర్ణాటకకు చెందిన శివానీగా గుర్తింపు
పోలీసులు… pic.twitter.com/Wegc3LIuje
— BIG TV Breaking News (@bigtvtelugu) September 30, 2025