BigTV English

Actor Nani: ముసుగు వేసుకుని మరీ థియేటర్ లో ఆ సినిమాలు చూసిన నాని.. వీడియో వైరల్!

Actor Nani: ముసుగు వేసుకుని మరీ థియేటర్ లో ఆ సినిమాలు చూసిన నాని.. వీడియో వైరల్!

Actor Nani: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నాని(Nani) ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు నిర్మాతగాను, మరోవైపు హీరోగాను వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా నానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా నాని ముసుగు వేసుకొని మరి ఏఎంబి సినిమాస్(AMB Cinemas) లో సినిమా చూడటం కోసం వచ్చారు. అయితే ఎవరు తనని గుర్తుపట్టకుండా ఉండటం కోసం ఏమాత్రం మొహం కనపడకుండా ముసుగు వేసుకొని సినిమాలు చూసినట్టు తెలుస్తుంది.


కూలీ, వార్ 2 సినిమాలు చూసిన నాని..

ఇటీవల ఎన్టీఆర్ హీరోగా నటించిన వార్ 2(War 2), రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ(Coolie) సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలను చూడటం కోసం నాని ఏ ఎం బి సినిమాస్ చేరుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నాని ఇలా తనని గుర్తుపట్టకుండా ముసుగు వేసుకోవడానికి కూడా కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఈయన ది ప్యారడైజ్ (The Paradise)సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందరికీ కనిపించేలా నాని బయట తిరగడంతో తన సినిమాకు సంబంధించిన లుక్ బయటపడుతుంది. అందుకే ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని సినిమా చూడటం కోసం వెళ్లారని తెలుస్తోంది.


8 భాషలలో ది ప్యారడైజ్ …

ఇక నాని నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కోర్టు సినిమా ద్వారా నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న ఈయన హిట్ 3 సినిమాతో మరో సక్సెస్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏకంగా ఎనిమిది భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇందులో నాని చాలా విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారు.

నాని రెండు జడలు వేసుకుని ఈ సినిమాలో కనిపించనున్నారని ఇదివరకు విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే స్పష్టం అవుతుంది. తాజాగా ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తి అయిందని చిత్ర బృందం ఒక వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఇలా సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్ చూస్తుంటే మాత్రం ఈసారి నాని పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టబోతున్నారని స్పష్టమవుతుంది. ఈ సినిమాని 2026 మార్చి 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఇది వరకే నాని , శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో దసరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మరోసారి ఇద్దరి కాంబోలో సినిమా అంటేనే సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. ఇక తదుపరి నాని నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో చిరంజీవి హీరోగా సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్యారడైజ్ సినిమా షూటింగ్ పనులు పూర్తికాగానే చిరు సినిమా పనులు మొదలు కాబోతున్నాయి.

Also Read: Upasana: ఉపాసనకు కూడా ఇలాంటి అలవాటు ఉందా… గంటల తరబడి అదే పనిచేస్తుందా?

Related News

Kriti sanon: ఖరీదైన లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన ప్రభాస్ బ్యూటీ…ధర ఎంతంటే?

Bose-The Mystery Unsolved Trailer: నేతాజీ చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే..

Raj Kundra: స్వామీజీకి కిడ్నీ దానం చేస్తానన్న నటి భర్త.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

Kishkindhapuri Teaser: నమస్కారం.. ఈ రోజు శుక్రవారం.. భయపెడుతున్న’కిష్కంధపురి’ టీజర్‌

Sir Madam OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సార్ మేడమ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Alia Bhatt: ఇదేమైనా మీ ఇల్లు అనుకున్నారా… ఫోటోగ్రాఫర్ల పై ఫైర్ అయిన అలియా!

Big Stories

×