Realty Sector: దేశంలో రియాల్టీ సెక్టార్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకుని భారీ భవనాల నిర్మాణాలు జరిగేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. ధనవంతులను దృష్టిలో పెట్టుకుని కొన్ని రియాల్టీ సంస్థలు లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ఇప్పటికే గురుగ్రామ్, పూణె లాంటి సిటీల్లో ఆ తరహా ప్రాజెక్టులు ఉన్నాయి.
రియాల్టీ సెక్టార్ కొత్త పుంతలు
తాజాగా సన్‌టెక్ రియాల్టీ సంస్థ అల్ట్రా లగ్జరీ హౌసింగ్ విభాగంలోకి అడుగు పెట్టేసింది. ఆ సంస్థ చేపట్టనున్న కొత్త ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాట్‌ను రూ. 100 కోట్ల నుంచి మొదలవుతోంది. గరిష్టంగా రూ. 500 కోట్ల వరకు ఉంటుంది. ఇది కలా..? నిజమా అన్న సందేహాలు లేకపోలేదు. అత్యంత ఖరీదైన ప్రాజెక్టుల కోసం సన్ టెక్ రియాల్టీ ‘ఎమాన్సే’ అనే సరికొత్త బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఈ తరహా నిర్మించే ఇళ్లను కేవలం ఆహ్వానం ద్వారా విక్రయించనుంది. ఈ విషయాన్ని సన్‌టెక్ రియాల్టీ సీఎండీ కమల్ ఖేతన్ వెల్లడించారు. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను ముంబై, దుబాయ్ లాంటి నగరాల్లో చేపడుతోంది. ముంబైలోని నేపియన్సీ రోడ్ ఏరియా, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా ప్రాంతంలో వాటి నిర్మాణాలు జరగనున్నాయి.
అల్ట్రా లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులు
వచ్చే ఏడాది జూన్ నాటికి రెండు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా రూ. 20 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. సన్‌టెక్ రియాల్టీకి ఇదే తొలి విదేశీ ప్రాజెక్ట్ దుబాయ్‌దే కావడం గమనార్హం. ఈ ప్రాజెక్టులో చదరపు అడుగు ధర రూ. 2.5 లక్షలు దాటవచ్చు.
ALSO READ: పతంజలి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. టాప్ స్పీడ్ ఎంతో తెలుసా?
దేశంలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన, ప్రత్యేకమైన ప్రాజెక్టులుగా నిలవనుంది. సన్‌టెక్ రియాలిటీ భారతదేశంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. ఇప్పటివరకు 32 ప్రాజెక్టులను ప్రారంభించింది. గతంలో అల్ట్రా-లగ్జరీ అపార్ట్‌మెంట్‌లు డీఎల్ఎఫ్ కామెల్లియాస్ కేరాఫ్ గా ఉండేవి. ఒక్కో ఫ్లాట్ రూ. 100 కోట్ల వరకు వసూలు చేసేవి. గతంలో గురుగ్రామ్‌లో ఓ ఫ్లాట్ వందల కోట్లకు అమ్ముడుపోయింది కూడా. ఇప్పుడు దాని రికార్డును సన్‌టెక్ బద్దలు కొట్టనుంది.