BigTV English

History of Lord Krishna’s Idol:గురువాయూర్ శ్రీకృష్ణుడి విగ్రహానికి నాలుగు యుగాల చరిత్ర

History of Lord Krishna’s Idol:గురువాయూర్ శ్రీకృష్ణుడి విగ్రహానికి నాలుగు యుగాల చరిత్ర

History of Lord Krishna’s Idol:గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయంలో రిచెస్ట్ టెంపుల్ గా అవతరిస్తోంది. కేరళ లోని త్రిస్సూర్ జిల్లాలోని గురువాయూర్ ఆలయం కృష్ణుడికి అంకితం చేయబడింది. ఇక్కడ కఠినమైన డ్రెస్ కోడ్ పాటించాలి. శ్రీకృష్ణ దేవాలయం ఖజానాలో 260 కిలోలకు పైగా బంగారం ఉన్నట్లు ప్రకటించింది. ఆలయ అధికారులు ఒక సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానంగా దేవస్థానం వివరాలను వెల్లడించింది. స్వామికి ఆలయంలో విలువైన ఆభరణాలు , నాణేలు సహా 263పైగా కిలోల బంగారం, సుమారు 20వేలు బంగారు లాకెట్లు ,5,359 వెండి లాకెట్లు,6,605 కిలోల వెండి ఉన్నాయని తెలిపారు. ఇటీవల దేవస్థానం రూ. 1,700 కోట్లకు పైగా బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు తెలిపింది. 271.05 ఎకరాల భూమి కూడా ఉంది


ఈ ఆలయం శాస్త్రీయ కేరళ శైలిలో నిర్మించారు. గురువయూర్ ఆలయం కేరళ ఆలయానికి వాస్తువిద్యకు ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. ఆలయం రెండు గోపురాలతో ఉంది, ఒకటి తూర్పు మరొకటి పశ్చిమాన. ఈ గోపురాల మధ్య ఉన్న మొత్తం ప్రాంతం పలకలతో కప్పబడి ఉంచడాన్ని అనాపంతల్ అని పిలుస్తారు. గర్భగుడిని బంగారు పూతతో రాగి షీట్ రూఫింగ్‌తో రెండు పొరలుగా రూపొందించారు. ఈ దేవత సాంప్రదాయకంగా మహావిష్ణువు సనాతన రూపంలో ఉంది. 4 చేతులు ఒక్కొక్కటి శంఖం, చక్రం, గధ ,పద్మం మూలవిగ్రాహం పతంజనా శిలాతో తయారు చేశారు. మరో రెండు విగ్రహాలు ఉన్నాయి, ఒకటి వెండితో మరియు మరొకటి బంగారంతో ఉంటుంది. గురువాయురప్పని కన్నన్‌, ఉన్నికృష్ణన్‌, బాలకృష్ణన్‌… అంటూ పలుపేర్లతో అర్చిస్తారు. ప్రధానపూజారి వేకువజామున 3 గంటలకే పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్నికృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మలదర్శనం అంటారు. రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీ అత్తరు, కొబ్బరినీళ్లు, గంధాలతో అభిషేకించి, పట్టు పీతాంబరాలూ స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు.

ఐదు వేల సంవత్సరాలక్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని వెుదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి. స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందించమని చెప్పాడని పురాణప్రతీతి.


Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×