Chittoor Crime News: చిత్తూరు జిల్లాలో గత నెల 25న జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.. నిందితులు కిషోర్, మహేశ్, హేమంత్‌లను గుడిపల్లె దగ్గర అరెస్ట్ చేశారు. అయితే ఈ ముగ్గురు నిందితులు బయట ఎక్కడైనా ప్రేమజంట కనిపిస్తే చాలు.. వారిని వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించి డబ్బులు, నగలు తీసుకుని వేధించేవారు.
అలా గత సెప్టెంబర్ 25వ తేదీనా ఓ ప్రేమజంటను బెదిరించి ఒకరి తర్వాత మరొకరు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక తల్లిదండ్రులు ఆలస్యంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా గ్రామస్థులు అప్పటికే ముగ్గుర్ని పట్టుకుని దేహశుద్ది చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసులో పలు సెక్షన్ల క్రింద చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా POCSO Act, SC/ST Atrocities Act, రాబరీ, హత్యాయత్నం, కిడ్నాప్ వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు గణనీయమైన ముందస్తు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు గుర్తించిన వీడియో సాక్ష్యాలు, ఫిర్యాదులను ఆధారంగా కోర్టులో దాఖలు చేస్తున్నారు.
Also Read: తిరుపతి ఉలిక్కిపడేలా బాంబు బెదిరింపులు
ఇందులో ఏ1 మహేష్ పై గతంలో మైనర్ బాలికను వేధించిన ఘటనపై కేసు నమోదు అయింది. గతంలో పాల్పడిన ఘటనకు సంబంధించి ఐదు వీడియోలను పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ ముగ్గురు నిందితులను పోలీసులు కోర్టుకి హాజరుపరచడానికి రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు. అలా ఈ ముగ్గురు నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్తుంటే.. పెద్ద ఎత్తున స్థానికులు అక్కడ చేరి ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూశారు. నిందితులను బూతులతో తిట్టిపోశారు. కొంతమంది కొట్టడానికి కూడా ముందుకు వచ్చారు. అయితే పోలీసులు వారిని వారించారు. ఈ ఘటన ఇప్పుడు చర్చనీయంగా మారింది.