Bigg Boss 9 promo 2: బిగ్ బాస్ 9(Bigg Boss 9) తెలుగు కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంటుంది. ఇక నేడు 26వ రోజుకు సంబంధించిన రెండో ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే మాత్రం ఒక్కసారిగా కళ్యాణ్ కు భారీగా గ్రాఫ్ పెరిగిపోయిందని చెప్పాలి. ఈ ప్రోమో వీడియోలో కళ్యాణ్(Kalyan) రీతు చౌదరి(Rithu Chowdary)తో ఉన్న తన ఫ్రెండ్షిప్ కి బ్రేకప్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ప్రోమోలో కళ్యాణ్ కంటతడి పెట్టుకోవడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు కళ్యాణ్ కంటతడి పెట్టుకోవడానికి గల కారణం ఏంటి రీతు పవన్ మధ్య గొడవ ఏంటి అనే విషయానికి వస్తే..
కెప్టెన్సీ టాస్కులో భాగంగా రీతు చౌదరి కళ్యాణ్ కు సపోర్ట్ చేయకపోవడంతో కాస్త ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. ఇలా రీతూ తనకు వెన్నుపోటు పొడిచింది అంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో పవన్ కళ్యాణ్ ఏడుపు చూసి తనుజ అక్కడికి వచ్చి ఎవరి మైండ్లో ఏముందో మనకి ఏది తెలియదు అంటూ ఓదారుస్తుంది. దీంతో పవన్ నేను రీతూని నమ్మిన విధంగా హౌస్ లోకి ఎవరిని నమ్మలేదని చెబుతాడు. ఇక రీతు డీమాన్ ను వెంటబెట్టుకొని కళ్యాణ్ కు సారీ చెప్పించింది . బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదరా.. ఫస్ట్ తీసేయమని ఎలా చెప్పావు.. నీ నోటి నుంచి ఆ మాట ఎలా వచ్చింది అంటూ కళ్యాణ్ సీరియస్ అవ్వడమే కాకుండా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతూ ఒకరి కష్టాన్ని దొబ్బడం కాదు అంటూ గట్టిగా అరిచారు.
గార్డెన్ ఏరియాలో ఉన్న కళ్యాణ్ వద్దకు రీతు వచ్చి తనని బ్రతిమలాడుతుంది. నాకు హౌస్ లో మొదటి నుంచి ఉన్నది మీరిద్దరే కానీ వీడి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు కూడా నన్ను తీసేయమన్నావు కదా అంటూ ఎమోషనల్ అయ్యాడు కళ్యాణ్. ఇదంతా గమనించిన డీమాన్ రీతుకి ఒక సలహా ఇచ్చాడు. నన్ను చీదురించుకున్నాడు అంటే నాకు అలాంటి వారి వెనుక వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదని చెప్పాడు. ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్లి నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను నేను ఓడిపోయాను అంటూ రీతూ చెప్పడంతో.. నేను బాధపడుతుంది ఓడిపోయినందుకు కాదు, మోసపోయినందుకు అంటూ కళ్యాణ్ ఏకధాటిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం శ్రీజ రీతూ మధ్య కూడా కాస్త వాదన జరుగుతుంది.
కళ్యాణ్ రీతువైపు కోపంగా చూడటంతో ఎందుకు అలా కోపంగా చూస్తున్నావు.. నిన్న మొన్న లేదు ఫ్రెండ్షిప్ అందరి ముందు పట్టుకొని నేను నిన్ను మోసం చేశానంటున్నావ్.. అలా అంటే ఎలా తీసుకుంటాను కళ్యాణ్ అంటూ రీతు గట్టిగా అరిచి గగ్గోలు పెట్టింది. ఏది ఏమైనా రీతు కళ్యాణ్ మధ్య జరిగిన ఈ గొడవ చూస్తుంటే ఇద్దరు మధ్య ఫ్రెండ్షిప్ కట్ అయిందని పథకం ప్రకారమే రీతూ కళ్యాణ్ కు వెన్నుపోటు పొడిచిందని స్పష్టమవుతుంది. ఇలా కళ్యాణ్ తిరగబడడంతో కళ్యాణ్ కరెక్ట్ అంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Ramcharan -Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్..మెగా వారసుడు రాబోతున్నాడా?