BigTV English

Horoscope 1 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది!

Horoscope 1 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది!

Astrology 1 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఆటంకాలు ఎదురవుతున్నాయి? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారంలో ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు. ప్రారంభించిన పనుల్లో పెద్దల సలహాలు అవసరం. అనవసరమైన కష్టాలను కొని తెచ్చుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. హనుమాన్ చాలీసా చదవడంతో మంచి ఫలితాలు ఉంటాయి.

వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి మంచి లాభాలు ఉంటాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారంలో అనుకున్న ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఊహించని లాభాలు ఉంటాయి. అనవసరంగా వాదనలు పెట్టుకోవద్దు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.


మిథునం:
మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శారీరక శ్రమ, ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారాల్లో ఆచితూచి నడుచుకోవాలి. మిత్రుల సహాయంతో లాభాలు పొందుతారు. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో హోదా పెరుగుతుంది. ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. హనుమాన్ చాలీసా చదవాలి.

కర్కాటకం:
కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన లాభాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

సింహం:
సింహ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారంలో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు లేకుండా పూర్తిచేస్తారు. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. ఒత్తిడికి లోనవుతారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదిత్య హృదయం పారాయణతో ప్రతికూలతలు తొలగుతాయి.

కన్య:
ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులను మనోబలంతో పూర్తి చేసి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. సంతానాభివృద్ధికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే బాగుంటుంది.

Also Read: సరిగ్గా 75 రోజుల తరువాత 4 రాశుల వారిపై శని దేవుడి అనుగ్రహం..

తుల:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థిక ప్రయోజనాలు వరిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. ప్రారంభించిన పనుల్లో ఉత్సాహం పనిచేయాలి. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురుకావొచ్చు. శ్రీ వేంకటేశ్వరస్వామి సందర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

వృశ్చికం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురుకావొచ్చు. ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా ఆందోళన చెందకుండా పూర్తి చేస్తారు. పిల్లల ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన మంచిది.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి అనుకూలంగా లేదు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఫలితాలు ఆలస్యమైనా నిరాశకు లోనుకావొద్దు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులకు జీతం పెరుగుదల ఉంటుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఉంటాయి. గోసేవ చేస్తే మంచిది.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆదాయం పదింతలు పెరుగుతుంది. సమాజంలో హోదా పెరుగుతుంది. శత్రువులపై నైతిక విజయం సాధిస్తారు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. శని ధ్యానం చేయడంతో శుభఫలితాలు పొందుతారు.

కుంభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. చేసే పనిలో ఒత్తిడి, శ్రమ ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీ ఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శుభఫలితాలు ఉన్నాయి. పెద్దల సహకారం ఉంటుంది. ధన, ధాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్, జీతం పెరుగుదల ఉంటుంది. జలగండం ఉంది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. హనుమత్ ఆరాధన శుభప్రదం.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×