Nandyal District: ఎప్పుడైనా రోడు మీద వెళ్తున్నప్పుడు వందో.. 200 రూపాయలు దొరికితే ఏం చేస్తాం.. అటు ఇటు చూసి టక్కున జేబులో పెట్టుకుంటాం. అలాంటి బంగారమే దొరికితే ఎలా ఉంటుంది?.. ఒక్కసారి ఊహించుకోండి. చాలా మంది అయితే బంగారాన్ని తీసుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడో ఒక దగ్గరైతే.. తిరిగి ఇచ్చేయడం.. పోలీసులకు అప్పగించడమో చేస్తుంటారు. ఇలాంటి ఇన్సిడెండే అనంతపురంలో చోటుచేసుకుంది. ఇక్కడ ఓ డ్రైవర్‌కి దొరికింది.. తులమో.. రెండు తులాలో కాదు.. ఏకంగా 12 తులాలు.. అంటే అక్షరాల 13లక్షలకు ఎక్కువే. బట్ ఇక్కడ ఓ డ్రైవర్ మాత్రం 12 తులాల గోల్డ్ దొరికినా.. తిరిగి ఇచ్చి నిజాయితీని చాటుకున్నాడు. అసలు బంగారం ఎక్కడ దొరికింది!.. ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో తెలుసా..?
ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్ చంద్రశేఖర్
నంద్యాల జిల్లాకు చెందిన సూర్యనారాయణ, లక్ష్మీబాయి దంపతులు ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనంతపురం పట్టణం వచ్చారు. వివాహ కార్యక్రమం అయిపోయాక మారుతీ నగర్ నుంచి బస్టాండుకు వెళ్లేందుకు ఆటో బుక్ చేసుకున్నారు ఆ దంపతులు. అయితే ఆటోలో బస్టాండుకు బయలుదేరి వెళ్లిన సూర్యనారాయణ, లక్ష్మీబాయి దంపతులు.. బస్టాండ్‌లో దిగి.. బస్సు ఎక్కే హడావుడిలో బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ మర్చిపోయారు.
ఆటోలో మర్చిపోయిన బ్యాగ్‌ను పోలీస్ స్టేషన్‌లో అప్ప చెప్పిన డ్రైవర్ చంద్రశేఖర్
వారు దిగిన కొంత సమయానికి ఆటో డ్రైవర్ ఆ బ్యాగును గమనించాడు. దానిని తెరిచి చూస్తే అందులో ఉన్న బంగారు ఆభరణాలు ఉన్నాయి. వెంటనే అతను ఆ సూట్ కేసును తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించినా వారు కనిపించలేదు. అప్పుడు ఆ ఆటో డ్రైవర్ నిజాయితీగా బంగారం ఆభరణాల బ్యాగ్‌ను తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు.
Also Read: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?
చంద్రశేఖర్ నిజాయితీకి మెచ్చుకుని సన్మానం చేసిన పోలీసులు
వారు వెంటనే బంగారం ఎవరిది అనే విషయాన్ని గుర్తించి 12 తులాల బంగారం అందించారు. 12 తులాల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ తిరిగి ఇచ్చి నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ చంద్రశేఖర్‌ను మెచ్చుకున్న పోలీసులు సన్మానించారు. సూర్యనారాయణ, లక్ష్మీబాయి దంపతులకు బంగారు ఆభరణాలను అందజేశారు. 12 లక్షల రూపాయల విలువ ఉన్నప్పటికీ ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ నిజాయితీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది.
ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్..
నంద్యాలలో ఓ వివాహానికి హాజరై ఆటోలో తిరిగి వస్తుండగా 12 తులాల బంగారం ఉన్న బ్యాగ్ మరిచిపోయిన సూర్యనారాయణ, లక్ష్మీబాయి దంపతులు
ఆటోలో మరిచిపోయిన బ్యాగ్ ను గమనించి పోలీస్ స్టేషన్ లో అప్ప చెప్పిన డ్రైవర్ చంద్రశేఖర్
ఆటో… pic.twitter.com/1RrJrKRkQX
— BIG TV Breaking News (@bigtvtelugu) November 7, 2025