BigTV English
Advertisement

HBD Anushka: 20 ఏళ్ల సినీ కెరియర్ లో అనుష్క ఆస్తులు ఎన్ని కోట్లంటే?

HBD Anushka: 20 ఏళ్ల సినీ కెరియర్ లో అనుష్క ఆస్తులు ఎన్ని కోట్లంటే?

HBD Anushka:అనుష్క శెట్టి అలియాస్ స్వీటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పాన్ ఇండియా హీరోయిన్గా పేరు దక్కించుకున్న ఈమె.. ఇండస్ట్రీకి వచ్చి విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయినా ఇప్పటికీ ఈమె క్రేజ్ తగ్గలేదు అనడంలో సందేహం లేదు. తన అద్భుతమైన నటనతో.. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించడంలో అనుష్క మొదటి పాత్ర వహిస్తుంది. రాజసం ఉట్టిపడే పాత్రలలోనైనా.. గ్లామర్ వలకబోయడంలోనైనా ఈమె తర్వాతే ఎవరైనా.. అందుకే క్వీన్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ అంటూ బిరుదును కూడా దక్కించుకుంది అనుష్క శెట్టి.


44వ పుట్టినరోజు జరుపుకుంటున్న అనుష్క..

ఇదిలా ఉండగా.. ఈరోజు అనుష్క శెట్టి పుట్టినరోజు ఈ ఏడాది 44వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు అనుష్కకు స్పెషల్ బర్తడే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే అనుష్క ఆస్తుల విలువ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. యోగా టీచర్ గా కెరియర్ మొదలుపెట్టిన అనుష్క శెట్టి.. ఆ తర్వాత మూడవ తరగతి పిల్లలకు స్కూల్ టీచర్ గా కూడా కొంతకాలం పనిచేసింది.. తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది అనుష్క.

అనుష్క రెమ్యూనరేషన్..

అలా సినీ ఇండస్ట్రీలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అనుష్క 50 కంటే ఎక్కువ చిత్రాలలో నటించింది. ఒక్కో సినిమాకు సుమారుగా 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈమె.. రీసెంట్గా ఘాటీ సినిమా కోసం ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం. అయితే అలా వచ్చిన రెమ్యూనరేషన్ తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఎండార్స్మెంట్ల ద్వారా కూడా నెలకు కోటి రూపాయల వరకు సంపాదిస్తోందట. అలా సంవత్సర ఆదాయం రూ.12 కోట్లని సమాచారం.


అనుష్క ఆస్తుల విలువ..

అనుష్క మొత్తం ఆస్తుల విలువ విషయానికి వస్తే.. సుమారుగా 140 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. హైదరాబాదులో ఒక బంగ్లా ఉందని.. దాని విలువ 12 కోట్ల వరకు ఉంటుందని.. హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో ఒక ఫామ్ హౌస్ ఉందని.. అలాగే సొంత ఊరు మంగళూరులో కూడా చాలా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

ALSO READ:TV: పెళ్లైన 5 ఏళ్లకు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటి.. ఎవరంటే?

అనుష్క కార్ కలెక్షన్..

ఆస్తుల తోపాటు లగ్జరీ కార్లు కూడా ఈమె కారు గ్యారేజ్ లో మనకు దర్శనమిస్తాయి. ఆడి ఏ సిక్స్, ఆడి q5, టయోటా కరోలా ఆల్టిస్, బీఎండబ్ల్యూ 6 సిరీస్ వంటి విలువైన కార్లు ఈమె సొంతం. ఇకపోతే ఎప్పుడు సింపుల్ గా కనిపించే అనుష్క ఎక్కువగా ట్రావెలింగ్ చేయడానికి ఇష్టపడుతుంది.

అనుష్క సినిమాలు..

అనుష్క సినిమాల విషయానికి వస్తే.. తొలిసారి మలయాళంలో నటిస్తోంది. కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్ అనే పేరుతో ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. అలాగే భాగమతి సీక్వెల్లో కూడా ఈమె నటిస్తోంది.

Related News

Vrusshabha Release: మోహన్ లాల్ వృషభ కొత్త రిలీజ్ డేట్… టార్గెట్ క్రిస్మస్‌

Mammootty: అరుదైన గౌరవం దక్కించుకున్న మమ్ముట్టి మూవీ!

Priyanka Chopra: హీరోయిన్ గారి ఖర్చే కోట్లలో ఉందంట.. అయినా జక్కన్న మౌనం.. కారణం ఏంటి..?

SSMB29: ఎట్టకేలకు రాజమౌళి-మహేష్‌ మూవీ నుంచి అప్‌డేట్‌.. పృథ్వీరాజ్ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది!

Rashmika Mandanna: విజయ్.. కచ్చితంగా నువ్వు నన్ను చూసి గర్వపడతావ్

Peddi: చికిరి చికిరి సాంగ్ వచ్చేసిందోచ్.. లిరికల్ కాదు ఏకంగా వీడియోనే.

Katrina Kaif: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రీనా

Big Stories

×