EPAPER

Horoscope 10 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Horoscope 10 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Astrology 10 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశాజనకంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. తోటివారి సహకారంతో సకాలంలో పనులు పూర్తిచేస్తారు. కోపాన్ని దూరంగా ఉంచాలి. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగించవచ్చు. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. గోసేవ చేస్తే మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కొత్త కార్యక్రమాలు మొదలుపెడతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రీలక్ష్మీదేవని ఆరాధిస్తే శుభఫలితాలు.


మిథునం:
మిథున రాశి వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగులపై ఉన్నతాధికారులకు నమ్మకం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుంటారు. మిత్రులతో కలిసి దైవదర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యం క్షీణిస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఇష్టదేవతా స్తోత్రం పారాయణ శుభప్రదం.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు వరిస్తాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఊహించని ధనలాభం ఉంటుంది. తొటివారి సహకారంతో పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచిది.

సింహం:
సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఆఫర్స్ వస్తాయి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మిత్రులతో సంతోషంగా ఉంటారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. గిట్టనివారితో ఆచితూచి వ్యవహరించాలి. పిల్లల విషయంలో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రీరామరక్షాస్తోత్రం చదవాలి.

కన్య:
ఈ రాశి వారికి ధర్మసిద్ధి ఉంది. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆశించిన లాభాలు వరిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పెండింగ్ సమస్యలు తీరుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతారాధన శుభప్రదం.

Also Read: వచ్చే ఏడాది వరకు ఈ 3 రాశుల వారు రాజభోగాన్ని అనుభవించబోతున్నారు..

తుల:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. శ్రమతో కూడిన పలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు వస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కీలక వ్యవహారాల్లో తోటివారి సహకారం ఉంటుంది. ఆస్తి వివాదంలో రాజీమార్గం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. మొండి బాకాయిలు చేతికి అందుతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్స్, జీతం పెరుగుదల ఉంటుంది. వృథా ఖర్చులకు దూరంగా ఉంటారు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

ధనుస్సు:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. శ్రమతో కూడిన ఫలితాలు అందుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో సంతోషంగా ఉంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. కీలక వ్యవహారాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం.

మకరం:
మకర రాశి వారిక శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి మంచి లాభాలు ఉంటాయి. ఇష్టమైన వారితో సమయం కేటాయిస్తారు. మనోధైర్యంతో చేసే పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనుకోకుండా పెళ్లి సంబంధం ఖాయం కావొచ్చు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండాలి. ఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం.

కుంభం:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. అనుకున్న పనులు నెరవేరుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అదనపు ఆదాయం విషయంలో నష్టం వస్తుంది. అర్థలాభం ఉంది. ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పర్వాలేదు. ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. శత్రువుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదైవారాధన శుభప్రదం.

మీనం:
మీనరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభదాయకంగా ఉంటాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రుల అండగా నిలుస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొంటారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన మేలు చేస్తుంది.

Related News

Lakshmi Puja 2024: లక్ష్మీదేవి మంత్రం జపిస్తే మీ జీవితాన్ని సమృద్ధిగా డబ్బుతో నింపుతుంది

Guru Vakri 2024: 12 ఏళ్ల తర్వాత వృషభ రాశిలో గురుడు తిరోగమనం.. 119 రోజులు ఈ 3 రాశుల వారి జీవితంలో ఆనందమే

Tulsi Chalisa Benefits: కోరికలు తీరి, ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ సాధారణ పని చేయండి !

Budhaditya Rajyog 2024: సూర్యుడు-బుధుడు కలిసి బుదాధిత్య రాజయోగం ఈ 3 రాశుల వారు ధనవంతులు అవుతారు

Grah Gochar: కర్కాటక రాశితో సహా ఈ 4 రాశుల వారు ఆర్థికంగా లాభపడతారు

Horoscope 14 october 2024: ఈ రాశి వారికి అనుకూలం.. పట్టిందల్లా బంగారమే!

Shani Vakri 2024: 30 సంవత్సరాల తర్వాత దీపావళి నాడు శుభ యోగం.. ఈ 4 రాశుల జీవితంలో అన్నీ శుభ దినాలే

Big Stories

×